సినిమా ఇండస్ట్రీలో పెద్దపెద్ద ఆర్టిస్టులనీ చూసి వాళ్లకి ఏంటి వాళ్ళు రాయల్ లైఫ్ ని అనుభవిస్తారు అని మనం అనుకుంటాం.కానీ ఇండస్ట్రీలో బాగా బతుకుతూ కార్లలో తిరుగుతూ కనిపించేవారు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ బాగా ఎదిగిన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టుల కంటే, ఒకపూట గడిస్తే ఇంకొక పూట ఎలా గడుస్తుందో అని దిగులుతో బతికే జనాలు ఎక్కువ మంది ఉన్నారు.
సినిమా అంటే మనం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఫిలింనగర్ అని అనుకుంటాం కానీ కృష్ణానగర్లో చాలామంది వేషాల కోసం తిరుగుతూ వేషాలు రాక కష్టపడుతూ ఏం చేయాలో తెలీక బాధపడే వారు చాలామంది ఉంటారు.బాహుబలి సినిమాలో నటించిన ప్రమీల రాణి అనే బామ్మ కూడా ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చింది.
ఆమె స్వతహాగా విజయవాడ అయినప్పటికీ సినిమా వేషాల కోసం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటుంది.ఆమె 13 సంవత్సరాల కే చాలా నాటకాలు వేసేది ఇప్పుడున్న సింగర్ మను తో కలిసి చాలా స్టేజి నాటకాలు కూడా వేసింది.
అయితే ఈ బామ్మ విజయశాంతి నటించిన వైజయంతి అనే మూవీ లో ఒక మంచి తల్లి క్యారెక్టర్ చేయడం తో ఆమెకు అప్పట్నుంచే అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి.విక్రమార్కుడు సినిమా కి గాను ఈ బామ్మనీ రాజమౌళి గారి వదిన కీరవాణి గారి భార్య అయిన వల్లి గారు ఒక క్యారెక్టర్ కోసం పిలిపించారు.
విక్రమార్కుడు సినిమా లో విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ఆ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు.
అలాంటి క్యారెక్టర్ ని సినిమాలో ట్టేట్లా అనే విలన్ విక్రమ్ సింగ్ రాథోడ్ నీ చంపినప్పుడు బతికించే బామ్మ క్యారెక్టర్ కోసం ప్రమీలారాణి అయిన ఈ బామ్మనీ వల్లి గారు పిలిపించారట.తర్వాత ఈమె చాలా క్యారెక్టర్లు చేసినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలు బామ్మ గా ఓ మంచి క్యారెక్టర్ చేసిందనే చెప్పాలి.బాహుబలి సినిమాలో బాహుబలి పుట్టినప్పుడు రాజమాత అయిన శివగామి చేతిలో బాబు ను పెట్టి మగబిడ్డ పుట్టాడు అని చెప్పే క్యారెక్టర్.
ఈ క్యారెక్టర్ చేసినప్పుడు రమ్య కృష్ణ గారితో చాలా ఫన్నీగా ఉండేవారట కామెడీగా రమ్య కృష్ణ గారు ఈ బామ్మని నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావే ముసలి అని ఆటపట్టించే వారట.దండాలయ్య సాంగ్ లో ప్రభాస్ కి అన్నం తినిపించే సీన్ లో ప్రభాస్ కి అన్నం తినిపిస్తుంటే షూట్ అయిపోయిన తర్వాత ఫన్నీగా ప్రభాస్ ఏంటి బామ్మ సీన్ లో అన్నం తినిపించ మంటే అంటే ఆ గంజి మెతుకులు తినిపిస్తావా, బిర్యాని తెచ్చి పెట్టొచ్చుగా అని నవ్వుతూ అన్నాడంట.
ప్రమీలారాణి మాట్లాడుతూ బాహుబలి సెట్లో ప్రభాస్ తనని బాగా ఆప్యాయతగా పలకరించే వారట.ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ బాగా చనువుగా ఉంటాడు అంట వేదం సినిమాలో అల్లు అర్జున్ బామ్మగా నటించింది దాంట్లో నటించినప్పుడు అల్లు అర్జున్ కూడా చాలా బాగా మాట్లాడే వాడిని చెప్పుకొచ్చింది.ఇక సినిమా విషయం పక్కన పెడితే తను పర్సనల్ లైఫ్ లో చాలా కష్టాలు అనుభవించింది.16 సంవత్సరాలకే పెళ్లయింది కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆయనతో ఉండలేక కోర్టుకెళ్లి విడాకులు తీసుకుంది.విడాకులు తీసుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు దీంతో చేసేదేమీ లేక నాటకాల్లో నటించడం మళ్ళీ స్టార్ట్ చేశారు.అయితే నాటకాలు వేసే దగ్గర ఒక వ్యక్తితో పరిచయమై అది ప్రేమకు దారి తీసి ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక తెలిసింది అతనికి పెళ్ళయిందని.
ముందు పెళ్లి కాలేదు అని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.అయితే డాక్టరు ఇచ్చిన సర్టిఫికేట్ కాదని ఆమెకి ముగ్గురు పిల్లలు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.
పిల్లలు పుట్టాక కొన్ని రోజులకే ఆమె భర్త బాగా డ్రింక్ తాగడం తో చనిపోయారు.దీంతో ఆమె సినిమాల్లో నటిస్తు వాళ్ళ పిల్లల్ని చదివించింది ఇప్పుడు సినిమా లో వస్తున్న అవకాశాలతో తనకు తాను సొంతగా బ్రతుకుతుంది.