ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి వరకు విశాఖ జిల్లా మీద ఆధిపత్యం కోసం మరో మంత్రి అయ్యన్నపాత్రుడితో నిరంతరం పోటీ పడేవారు.గంటా మంత్రి అయిన తొలి రోజుల్లో విశాఖ జిల్లాలో గంటాదే ఆధిపత్యం ఉండేది.
అయితే తర్వాత రోజుల్లో లోకేష్, చంద్రబాబు సైతం అయ్యన్నకు ప్రయారిటీ పెంచడంతో జిల్లాలో గంటా దూకుడు తగ్గింది.ఇక ఆ తర్వాత గంటా తన కొడుకు రవితేజను హీరోగా చేయడంతో పాటు విశాఖకు టాలీవుడ్‌ను తీసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు.
ఈ రెండు విషయాల్లోను గంటా తీవ్ర ప్రయత్నాలు చేసినా రెండిట్లోను ప్లాప్ షో వేశారన్న టాక్ వినపడుతోంది.విశాఖ నగరంలో సినీ పరిశ్రమ విస్తరించేందుకు ఎంతో అనువైన వాతావరణం ఉంది.
ఇక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి.విశాఖకు టాలీవుడ్ తీసుకువెళితే వెనకపడిన ఉత్తరాంధ్రలో ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని ఆ ప్రాంత ప్రజలు గంటామీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
విశాఖలో అందుకోసం భూములు కేటాయించడంలో గంటా సక్సెస్ అయినా ఆ తర్వాత విశాఖ ఇండస్ట్రీ విషయాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలు వచ్చేశాయి.గంటా టాలీవుడ్‌ను విశాఖ తరలించే విషయాన్ని పక్కనపెట్టి తన కొడుకు రవితేజను టాలీవుడ్ హీరోగా నిలబెట్టేందుకు తాపత్రయపడుతున్నారన్న విమర్శలు ఆయన మూటకట్టుకున్నారు.
అయతే గంటా ఈ విషయంలో కూడా ప్లాప్ షో వేసినట్టే స్పష్టమవుతోంది.గంటా తన కొడుకు రవితేజను టాలీవుడ్‌కు హీరోగా ఇంట్రడ్యూస్ చేసే విషయాన్ని ముందుగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు చేతుల్లో పెట్టారు.
ఆయన ఖాళీ లేక సీనియర్ దర్శకుడు జయంత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.ఏమైందో ఏమోగాని ఫామ్‌లోని లేని జయంత్ డైరెక్షన్‌లో సినిమా చేసే విషయంలో గంటా ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
ఇక గంటా కొడుక్కి ఎలాగూ మెగా ఫ్యామిలీ అండదండలు ఉండనే ఉంటాయి.అయినా ఇప్పుడు రవితేజ సినిమా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం విచిత్రంగా ఉంది.
ఇక రాజకీయంగా కూడా విశాఖ జిల్లాలో లోకేష్ జోక్యం ఎక్కువవ్వడంతో గంటా లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.ఏదేమైనా గంటాకు ఇప్పుడు అన్నింటా బ్యాడ్ టైం బాగా నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది.