ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటు అయిపొయింది.తాజాగా ఓ యువకుడు ఇంటికి రాత్రి సమయంలో కొంతమేర లేటుగా వచ్చినందున ఎందుకు లేటుగా వచ్చావని మందలించడంతో ఏకంగా ఆత్మ హత్య చేసుకుని తన కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తే స్థానిక జిల్లాకు చెందిన ఉంగుటూరు మండలంలోని ఓ గ్రామంలో రమేష్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే రమేష్ ఇదే జిల్లాకు చెందిన ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో కాలేజీ కి సెలవులు ఇవ్వగా ఇంటి వద్దనే ఉంటున్నాడు.దీంతో ఈ మధ్య రమేష్ రాత్రి సమయంలో కొంతమేర ఆలస్యంగా ఇంటికి వస్తుండడంతో అతని తల్లిదండ్రులు రోజూ ఇంటికి ఎందుకు లేటుగా వస్తున్నావు మరియు రోజూ ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ప్రశ్నించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి రమేష్ తన ద్విచక్ర వాహనం తీసుకొని వెళ్లి స్థానిక గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి ఓ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.అలాగే ఆత్మహత్య చేసుకునే ముందు తన బంధువులకు స్నేహితులకు మరియు స్నేహితులకు మిస్ యూ అంటూ మెసేజ్ కూడా చేశాడు.
దీంతో అనుమానం వచ్చిన ఇటువంటి కొందరు స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులని సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కష్టపడి చదివించిన కొడుకు చేతికంది రాగానే ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు ఆర్త నాదాలు మిన్నంటుతున్నాయి.
అంతేకాక ప్రస్తుత జనరేషన్ లోని యువత ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ అయ్యిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.