చెన్నైలో ఆంధ్ర అయ్యప్ప భక్తులపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీరంగం ఆలయంలో అయ్యప్ప భక్తులపై దాడి జరిగిందని తెలుస్తోంది.
శ్రీరంగం ఆలయంలోని సిబ్బందికి, అయ్యప్ప భక్తులకు మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది.ఈ క్రమంలోనే సుమారు ఐదుగురు ఆంధ్ర భక్తులకు గాయాలు అయ్యాయి.
దీంతో అయ్యప్ప భక్తులు ఆలయ సిబ్బంది తీరును నిరసిస్తూ దేవాలయంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అయితే అయ్యప్ప భక్తులు క్యూలైన్ లో ఉన్న సమయంలో గోవిందా.
గోవిందా అని నినాదాలు చేయడంతో సిబ్బంది దాడికి పాల్పడ్డారని సమాచారం.