భర్తను కొట్టి భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

రాష్ట్రంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి.తాజాగా సినీ ఫక్కీలో నలుగురు వ్యక్తులు పక్కాగా ప్లాన్ చేసి మహిళపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలంలో చోటుచేసుకుంది.

 Attrocities On A Married Woman In Guntur District By Four Persons, Attrocities-TeluguStop.com

మహిళ భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో దారికాచి అడ్డగించి భర్తను అతి దారుణంగా కొట్టి.కాళ్లు, చేతులు కట్టేసి భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి కొడవలు చూపించి బెదిరించి అత్యాచారం చేశారు.

ఈ ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సత్తెనపల్లి వడ్డెరకాలనీకి చెందిన భార్యాభర్తలు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామం లోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో ద్విచక్రవాహనంపై సత్తెనపల్లి కి తిరిగి ప్రయాణం అయ్యారు.పాలడుగు  రోడ్లు వెళ్తుండగా రోడ్డు పై చెట్టు పడి ఉంది.

చుట్టుపక్కనుంచి వెళ్తుండగా బైక్ కట్టె అడ్డుపెట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు.గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి కొడవళ్ళు చూపించి బెదిరించారు.

చేతులతో చితకబాదారు.బట్టలు విప్పి చేతులు, కాళ్లు కట్టేశారు మహిళలను పక్కకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

మహిళ మెడలో ఉన్న మంగళసూత్రం బంగారు ఉంగరం కాళ్ళ పట్టీలు లాక్కున్నారు.కొడవళ్ళు చూపిస్తూ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

సుమారు అర్ధ రాత్రి 12 గంటల వరకు ఈ దారుణం చోటుచేసుకుంది.

Telugu Andhra Pradesh, Guntur, Ipc, Married, Medikonduru, Telugu, Theft-Telugu C

12 గంటల తర్వాత దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో భార్యాభర్తలు తన  ద్విచక్రవాహనంపై సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడ  నిరాకరించారు.తమ పరిధిలోకి రాదని అన్నారు దీంతో గురువారం ఉదయం మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి వారు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 376డి, 394, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బాధితురాలిని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్స అందిస్తున్నారు.

 గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అలాగే ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube