ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ డీజీపీ స్పందన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికలు ముగిసాయి.ఏపీ ఎన్నికలు( AP Elections ) యుద్ధ రంగాన్ని తలపించాయి.

 Ap Dgp Sensational Comments On Evm Vandalism Incident Details, Ap Elections, Ap-TeluguStop.com

ఈసారి ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ…టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది.

పోలింగ్ రోజు నుంచి తర్వాత మూడు రోజుల వరకు అనేక గొడవలు జరిగాయి.పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ.

టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో( Macherla Constituency ) పోలింగ్ రోజే అనేక గొడవలు చోటు చేసుకున్నాయి.

బాంబులు కూడా విసురుకున్నారు.

ఇదిలా ఉంటే మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( MLA Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఇటీవల బయటకు రావడం జరిగింది.ఈ ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది.

దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త( AP DGP Harish Kumar Gupta ) నివేదిక అందజేశారు.ఈ నివేదికలో సంచలన విషయాలు పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తామని ఈసీకి డీజీపీ తెలియజేశారు.ఎమ్మెల్యే పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.

పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు గాలిస్తున్నాయని సీఈసీకి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube