1.సిపిఐ నారాయణ పై కొడాలి నాని కామెంట్స్

సిపిఐ నారాయణ ఓ వింత జంతువు అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు.
2.అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ : పురంధరేశ్వరి
అభివృద్ధిలో కాదని, అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది అని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు.
3.ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి భారత ప్రభుత్వ సహకారంతో స్వస్థలాలకు క్షేమంగా చేరుకుంటున్నారు.
4.ఉద్యోగుల కేటాయింపునకు మార్గదర్శకాలు
ఏపీలో కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.దీనిలో భాగంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం , కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్ ఫామ్ లను సిద్ధం చేసింది.
5.చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్

ప్రజా జీవితంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు గారికి అభినందనలు.ప్రతిపక్ష నేతగా ఆయన మరో 44 ఏళ్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.
6.ఫోటోగ్రాఫర్ ల రాష్ట్ర స్థాయి సమావేశం
ఏపీ బీజేపీ కార్యాలయం ఫోటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు.
7.వైసీపీపై నాదెండ్ల మనోహర్ కామెంట్స్
ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వం తో నియంత లా ఆలోచిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
8.కెసిఆర్ పై విజయశాంతి కామెంట్స్

ఆ శివుడు ఊరుకోడు.మూడో కన్ను తెరుస్తాడు .సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అంటూ బిజెపి నాయకురాలు విజయశాంతి కామెంట్ చేశారు.
9.కిడ్నాప్ లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించాలి
మహబూబ్ నగర్ కిడ్నాప్ ల పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.
10.ఎన్టీఆర్ స్టేడియం లో హునార్ హాట్ ఎగ్జిబిషన్
ఎన్టీఆర్ స్టేడియం లో హూనార్ హాట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
11.ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర : భట్టి
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.
12.మూడు రోజులపాటు పల్స్ పోలియో

తెలంగాణలో మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
13.యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
14.హైదరాబాద్ లో బిజెపి ముఖ్య నేతల భేటీ
హైదరాబాద్ లో బీజేపీ ముఖ్య నేత భేటీ జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి కీలక నేతలు హాజరయ్యారు.
15.గాంధీభవన్ లో కాంగ్రెస్ నిరుద్యోగ దీక్ష
నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టింది.ఈ దీక్షను మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రారంభించారు.
16.అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూలో మాణిక్యం ఠాకూర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ లో వెనకబడ్డ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ రివ్యూ నిర్వహిస్తున్నారు .దీనిలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రివ్యూ లో ఆయన పాల్గొన్నారు.
17.టిఆర్ఎస్ పై బండి సంజయ్ కామెంట్స్

యాసంగి వదులుకుంటానని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకుండా రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
18.నా పై నిఘా పెట్టారు : రఘు రామ

తనపై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు.
19.రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు ఉక్రెయిన్ విద్యార్థులు

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులు చేరుకున్నారు.