న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు : భట్టి

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

3.ఏపీ క్యాబినెట్ వాయిదా

ఈ నెల 3న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు.

4.రెండు విడతల్లో జేఈఈ మెయిన్స్

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

దేశంలో ఎన్.ఐ.టీ ల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ డ్ పరీక్ష రాసే అర్హుల్ని నిర్ణయించేందుకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జే ఈ ఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

5.కెసిఆర్ కుటుంబ మూలాలు బీహార్ లో : రేవంత్ రెడ్డి

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్ లో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

6.జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రం తిరస్కరించాలి

జాతీయ విద్యా విధానం 2022 ను  రాష్ట్రంలో అమలు చేయవద్దు అని , రాష్ట్రం దీన్ని తిరస్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

7.చెత్త తరలింపునకు అత్యంత ఆధునిక వాహనాలు

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

హైదరాబాద్ నగరంలో చెత్త తరలింపును అత్యాధునిక ఆయుధాలను, భారీ వాహనాలను వినియోగించనున్నట్లు జిహెచ్ఎంసి వెల్లడించింది.

8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 53,163 మంది భక్తులు దర్శించుకున్నారు.

9.మళ్లీ బయోమెట్రిక్ విధానంలోనే రేషన్

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

ఇక నుంచి బయో మెట్రిక్ విధానంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

10.రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా : షర్మిల

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కెసిఆర్ కి కనిపించడం లేదా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.

11.యూపీ ఎన్నికల పై కేసీఆర్ ఆరా

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తీరు పై వివిధ వర్గాల తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

12.స్కాలర్ షిప్ లకు నిధులు విడుదల చేయాలి

ఎస్సీ, ఎస్టీ , పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

13.తెలంగాణలో ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సర్వే

తెలంగాణలో ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం రాష్ట్ర వాసులు తెలంగాణలో ఎంత మంది ఉన్నారు అనే విషయంపై సర్వే నిర్వహిస్తోంది.

14.యాదాద్రి లో ఆన్లైన్ సేవలు

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

ఈనెల 28న యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

15.పీఆర్సీ కోసం పీడీఎస్ ఎంఎల్సీ ల దీక్ష

పీఆర్సీ కోసం పీడీఎస్ ఎంఎల్సీ లు దీక్ష చేపట్టనున్నారు.విజయవాడ లో ఈ నెల 4 న ఏడుగురు పీడీఎస్ ఎమ్మెల్సీ లు ఒక రోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

16.బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

మహా రస్త్రాలోని గోదావరి నది పై గల బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.

17.అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం

యదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా హైదరాబాద్ బర్కత్ పూర్ లో అఖండ జ్యోతీ యాత్ర ప్రారంభం అయ్యింది.

18.ఉజ్జయిని లో 11.21 లక్షల దీపాలు

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా 11.21 లక్షల దీపాలను వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించారు.

19.రాధే శ్యామ్ కొత్త ట్రెయిలర్ విడుదల

Telugu Ap Telangana, Ap Poltics, Ap Prc, Cm Kcr, Mallubhatti, Biometric, Revanth

ప్రబాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ కొత్త ట్రెయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,700

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,040

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube