టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికి పరిచయమే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.
తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా ఓ పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.
చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ ఉంటుంది.నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను తన ఫేస్ ఫోటోను ఒక వైపు చూపిస్తూ షేర్ చేసుకుంది.
ఆ ఫోటోలో తన బుగ్గ మీద ఉన్న పుట్టుమచ్చ కూడా కనిపించింది.దీంతో ఆ ఫోటో ని చూసిన తన ఫాలోవర్స్ తెగ లైక్స్ తో పాటు కామెంట్స్ పెడుతున్నారు.చాలా అందంగా ఉన్నావు అంటూ పొగుడుతున్నారు.మొత్తానికి ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.
ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలలో అనుపమను తీసుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాను 18 పేజెస్ సినిమాలో హీరో నిఖిల్ సరసన నటించిన సంగతి తెలిసిందే.ఇటీవలే కార్తికేయ2 తో ప్రేక్షకుల ముందుకి రాగా మంచి సక్సెస్ అందుకుంది.ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా బాగా అవకాశాలు అందుకుంటోంది.ఇక ఈ సినిమాలతో అనుపమ ఎటువంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.