నీరజ్ చోప్రాని వరించిన మరో బంగారు పతకం..

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిజానికి ఈ ఒలింపిక్స్‌లో ఇండియాకి కేవలం ఒకే ఒక స్వర్ణ పతకం లభించింది.

 Another Gold Medal By Neeraj Chopra , Niraj Chopra, New Record, Godl Medel, Vira-TeluguStop.com

అది కూడా నీరజ్ చోప్రా రూపంలో! ఒలింపిక్స్‌లో మాత్రమే కాదు అంతకు ముందు ఆడిన అనేక జావెలిన్ మ్యాచ్‌ల్లో నీరజ్ గొప్ప విజయాలు సాధించి ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు.అయితే ఒలింపిక్స్‌ తర్వాత ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో మళ్లీ మరొక బంగారు పతకం నెగ్గి అందరి ప్రశంసలు పొందుతున్నాడు ఈ 24 ఏళ్ల కుర్రాడు.

ప్రస్తుతం ఫిన్లాండ్‌లో కౌర్టెన్‌ గేమ్స్‌ జరుగుతున్నాయి.ఇందులో శనివారం జరిగిన జావెలిన్ పోటీల్లో నీరజ్‌ పాటిస్పేట్ చేశాడు.ఈ పోటీల్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ బల్లెంను ఏకంగా 86.96 మీటర్ల దూరం విసరగలిగాడు.విశేషమేంటంటే, ఈ పోటీల్లో ఇదే అత్యుత్తమ త్రోగా నిలిచింది.మిగతా వారు ఎవరూ కూడా మన ఇండియన్ అథ్లెట్‌ సెట్ చేసిన టార్గెట్ ను రీచ్ అవ్వలేక పోయారు.

దీంతో స్వర్ణ పతకం నీరజ్‌ సొంతమయ్యింది.

సాధారణంగా జావెలిన్ త్రో పోటీల్లో 6 సార్లు బల్లెంను త్రో చెయ్యవచ్చు.కానీ మూడో త్రోతోనే నీరజ్ తన ఆటను ఆపేశాడు.ఎందుకంటే ఈ పోటీలు జరుగుతున్నప్పుడే భారీ వర్షం వచ్చింది.

దీనితో అక్కడి మైదానమంతా చాలా తడిగా, జారే లాగా మారింది.ఈ జారుడు స్వభావం ఉన్న మైదానం పై నీరజ్ మూడో త్రో వేస్తున్నప్పుడు స్లిప్ అయి కిందపడిపోయాడు.

గాయాలేమీ కాలేదు కానీ నీరజ్ లాస్ట్ మూడు త్రోలు వేసే ఛాన్స్ వదులుకున్నాడు.మరో విషయం ఏంటంటే నీరజ్ రెండో త్రో చేసేటప్పుడు లైన్ దాటాడు.

దీంతో ఆ త్రో కాస్త ఫౌల్ గా మారింది.అయితే అతను ఫస్ట్ విసిరిన త్రోనే ఎవరూ రీచ్ కాలేదు కనుక అతన్ని గోల్డ్ మెడల్ వరించింది.

ఇదిలా ఉండగా నీరజ్‌ తర్వాత అత్యంత దూరం ఈటెను విసిరిన ఆటగాడిగా కెషర్న్‌ వాల్కట్‌ (86.64 మీటర్ల దూరం) నిలిచి రజతం దక్కించుకున్నాడు.ఆ తరువాత అత్యంత దూరం విసిరిన అండర్సన్‌ పీటర్స్‌ (84.75 మీటర్ల దూరం) కాంస్య పతకాన్ని ముద్దాడాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube