Varalakshmi Anjalidevi: వరలక్ష్మితో పోటీపడి అబాసుపాలైన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

ప్రస్తుతం సినిమా రంగంలో హీరోయిన్లు( Heroines ) ఒకరికొకరు చాలా పోటీ పడుతుంటారు.ఒకరిని మించి మరొకరు అవకాశాలను దక్కించుకునేందుకు బెడ్ రూమ్ సీన్స్, హాట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అవుతారు.

 Anjali Devi Try To Compete With Bhanuamthi And Varalakshmi-TeluguStop.com

అందుకే ఈ రోజుల్లో తమన్నా, కియారా, కృతి శెట్టి, సమంత, రష్మిక, రకుల్, రాశిఖన్నా వంటి వారు కూడా ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లకు ఓకే చెప్తున్నారు.అయితే ఇప్పటి హీరోయిన్ల మధ్యే కాదు అప్పటి హీరోయిన్ల మధ్య కూడా తీవ్ర పోటీ ఉండేది.1940-80 కాలంలోని హీరోయిన్లు అందం చూపించడంలో పోటీపడేవారు కాదు కానీ ప్రతిభను చూపించడంలో బాగా పోటీపడేవారు.

ఆ రోజుల్లో హీరోయిన్లు సంగీతం బాగా నేర్చుకొని తమ పాటలను తామే సొంతంగా పాడుకునేవారు.

భరతనాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్‌లు నేర్చుకొని అద్భుతంగా డ్యాన్సులు చేసేవారు.సహజమైన నటన చూపించడంలో కూడా వారికి వారే సాటిగా నిలిచేవారు.

ఉదాహరణకు అలనాటి హీరోయిన్ భానుమ‌తి( Bhanumati ) మంచి యాక్టింగ్ స్కిల్స్ కలిగి ఉండటమే కాక మ్యూజిక్ లో కూడా చాలా మెలకువలు నేర్చుకుంది.స్టోరీస్ కూడా అద్భుతంగా రాసేది.

ఈ రెండు రంగాల్లోనూ తన సత్తా చాటుతూ ఆమె మిగతా హీరోయిన్ల కంటే మంచి పేరు తెచ్చుకుంది.అంతేకాదు భానుమతి తన సినిమాలలోని పాటలను తానే పాడుకునేది.

ఏ సన్నివేశానికైనా తగిన పాటను ఆమె రాయగలదు, వాటిని సొంతంగా పాడగలదు.ఎస్.

వరలక్ష్మి( S Varalakshmi ) కూడా సింగింగ్ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకునేది.

Telugu Adi Yana Rao, Anjali Devi, Bhanumathi, Susheela, Varalakshmi, Suvarna Sun

వీరిద్దరూ సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే నటి అంజలీదేవి( Anjali Devi ) కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే వారిలాగా తాను కూడా పాటలు పాడాలని ఎంతో తపన పడింది.కానీ ఆమెకు సంగీతంలో ప్రవేశం లేదు.

అయినా తోటి హీరోయిన్లు పాటలు పాడుతూ దూసుకుపోతుంటే తాను కూడా సంగీతం నేర్చుకోవాలని భావించింది.షూటింగ్స్‌ ముగించుకున్న తర్వాత అప్ప‌టి రావు బాల‌ స‌ర‌స్వ‌తీ దేవి ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకోవడం కూడా మొదలు పెట్టింది.

సరిగ్గా అదే టైమ్‌లో ఓన్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి సువ‌ర్ణ‌సుంద‌రి సినిమాలో( Suvarnasundari Movie ) నిర్మించింది.ఈ సినిమాకు అంజ‌లీదేవి భర్త ఆది నారాయ‌ణ‌రావు సంగీత బాణీలు సమకూర్చారు.

Telugu Adi Yana Rao, Anjali Devi, Bhanumathi, Susheela, Varalakshmi, Suvarna Sun

అయితే అప్పటికే సంగీతం నేర్చుకుంటున్న అంజలి తన భర్త గైడెన్స్ తో పాట పాడాలని నిర్ణయించుకుంది.భర్త కూడా ఓకే చెప్పడంతో అంజలి సువర్ణ సుందరి సినిమాలోని “పిలువకురా.అలుగ‌కురా.” పాట పాడింది.అయితే ఆమె వాయిస్ బాగో లేకపోవడం, సరిగా పాట పాడక పోవడం వల్ల పి.సుశీలను( P Susheela ) తీసుకొచ్చారు.అంజలీ దేవి సరిగా పాడని చోట పి సుశీల గొంతును వాడారు.నిజానికి సుశీల చాలా వరకు పాటను పాడింది అంజలీ దేవి కోరస్ మాత్రమే పాడింది.

కానీ పాటను మాత్రం పూర్తిగా పాడలేక పోయింది.ఈ సంగతి తెలిసి అప్పట్లో చాలామంది నవ్వుకున్నారు.

ఎవరు చేసే పని వారు చేస్తేనే బాగుంటుందని హితవు పలికారు.ఆ తర్వాత అంజలి ఏ పాట పాడలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube