భారత సంతతికి చెందిన మహిళ అమెరికాలో రాజకీయాల్లో తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది అందుకు గాను తెలుగు వారు మరియు భారత ఎన్నారైల మద్దతు కూడా గడుతోంది.అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ చర్చల్లో పాల్గొంటూ ఒక్కొక్కరి మద్దతు కూడా గట్టడంలో ఆమె సక్సెస్ అవుతోంది వివరాలలోకి వెళ్తే.
ఫ్రీమాంట్‌లోని ఆర్టెన్‌వుడ్ డిస్ట్రిక్ట్ – 1 కౌన్సిల్‌కు పోటీ పడుతున్న చందు సిరాందాస్ ఆంధ్రా కి చెందినా తెలుగు అమ్మాయి అమెరికాలో సేవాకార్యక్రమాలలో ముందు ఉండే ఆమె ఎంతో మందికి చేయూత అందించారు.అయితే ఈ క్రమంలో ఆమె ఈ ఎన్నికలకి పోటీ పడటం తో సంతోషంగా ఉండనని అక్కడ భారత సంతతి వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు ఆమెకి మద్దతును ఇస్తున్నట్లు బే ఏరియా ఇండియన్ కమ్యూనిటీ ప్రముఖుడు, తానా మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి అన్నారు.
బే ఏరియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్ ఇండియన్ కుజిన్‌లో చందు కి మద్దతుగా బుధవారం జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు…తెలుగు అమ్మాయి అయిన చంద్రకళ ఇక్కడి రాజకీయాల్లో కూడా రాణించడానికి ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్స్ ప్రతేఒక్కరూ ఆమె గెలుపుకు కృషిచేయాలని పిలిపు ఇచ్చారు.