మంచి కిక్కిచ్చేలా సినిమా డైలాగులు చెప్పి పార్లమెంటులో అందరిని ఆకర్షించింది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం.జయదేవ్ బావ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో పాపులర్ డైలాగులు కొన్ని ఆయన వాడాడు.
అవన్నీ అప్పుడు టీడీపీకి కొంచెం కలిసొచ్చేనా ఇప్పుడు మాత్రం అవి టీడీపీ అధినేత చంద్రబాబుకి తిరిగి తగులుతున్నాయి.‘మాట ఇచ్చి తప్పేవాడు మనిషే కాదు.
’ అంటూ గల్లా జయదేవ్ అన్న ఆ మాటతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా బాగా ఇరకాటంలోకి పడేసినట్టుగా ఉన్నాడు.

ఇప్పుడు చంద్రబాబు ప్రత్యర్థులు ఆ డైలాగును ప్రస్తావిస్తున్నారు.మాట ఇచ్చి తప్పింది కేవలం మోడీ మాత్రమే కాదు కదా, చంద్రబాబు కూడా ఇదే కోవలోకే వస్తాడు కదా.అందుకే ఇప్పుడు వైఎస్సార్సీపీ వాళ్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.లోక్ సభలో సినిమా డైలాగును చెప్పిన గల్లా జయదేవ్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్నారు సోషల్ మీడియాలో రకరకాలా అంశాలను ప్రసస్తవిస్తూ ఆ డైలాగులతో ముడిపెట్టి మరీ వాడేసుకుంటున్నారు.
గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు.
ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల హామీలు ఇచ్చాడు.ఆ ఆరువందల హామీలు నిలబెట్టుకోవడం మాట అటుంచితే, కీలకమైన హామీల అమలులో కూడా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడు.
కొన్ని హామీలను కావాలని అమలు పెట్టలేదు.కేవలం ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, మాట నిలబెట్టుకోకపోవడం అనే తీరున వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
అదేమంటే హామీలన్నీ అమలయిపోయాయని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్న వైసీపీ నాయకులు బాబు ని టార్గెట్ చేసుకుని ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు.ఈ నేపథ్యంలో మాట ఇచ్చి తప్పేవాడు మనిషే కాదు అనే డైలాగును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పలుకుతోంది.
గల్లా జయదేవ్ ఈ డైలాగును చంద్రబాబు నాయుడుకు కూడా అప్లై చేయాలని వైసీపీ కౌంటర్ వేస్తోంది.







