చలి కాలంలో చాలా మంది ప్రజలు దగ్గు, జలుబు,( Cough cold ) కఫం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.కొంత మంది అయితే సీజన్ తో సంబంధం లేకుండా ఇలాంటి అనారోగ్య సమస్యలను( Health problems ) ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతే చాలా మంది యాంటీ బయోటిక్, సిరప్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.వీటిని కాకుండా సులభంగా లభించే కొన్ని పదార్థాలతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్రం అవుతాయి.
ఇంకా చెప్పాలంటే శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే ఊపిరితిత్తుల లో ఉన్న కఫం కూడా తొలగిపోతుంది.ఇంకా ఈ పానీయం తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పానీయాన్ని తయారు చేయడానికి పుదీనా ఆకులు, ( Mint Leave )అల్లం, కాస్త పసుపు ఉంటే సరిపోతుంది.
ముందుగా మీరు ఒక రెండు గ్లాసుల నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తర్వాత ఈ నీళ్లలో పది నుంచి 15 తులసి ఆకులను,ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి.
ఈ నీటిని ఐదు నిమిషముల పాటు మరిగించి పావు టేబుల్ స్పూను పసుపు వేసి ఇంకా రెండు నిమిషాలు మరిగించాలి.ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచాలి.ఆ తర్వాత నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి.ఆ తర్వాత ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తాగాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని తాగడం వల్ల కఫం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దూరం అవడంతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి.ఈ పానీయం తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.