టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ( Ntr ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం దేవర( Devara ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పలు కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ ( Deepavali Celebration ) లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
దీపావళి పండుగను పురస్కరించుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఇంట్లో టాలీవుడ్ సెలబ్రిటీ లందరికీ కూడా ఘనంగా పార్టీ ఇచ్చారు.ఈ పార్టీలో భాగంగా చిరంజీవి స్నేహితులతో పాటు రామ్ చరణ్ ఉపాసన స్నేహితులకు కూడా పాల్గొని సందడి చేశారు.అలాగే టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఇక్కడ హాజరై సందడి చేశారు.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ( Allu Shirish ) ఎన్టీఆర్ వంటి వారు కూడా హాజరుకాగా అల్లు శిరీష్ ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగారు.
ఇక ఈ ఫోటోని తాజాగా అల్లు శిరీష సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ తో కలిసి అల్లు శిరీష్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ఫ్రెండ్స్,ఫ్యామిలీ, ఎప్పుడు ఎవరు తనతో ఒక ఫోటో దిగాలని అడిగిన తారక్ అన్న అందరితోనూ ఒకేలాగే ఉంటారు.వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు.తారక్ అన్న చాలా ప్రేమ ఉన్న మనిషి అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి అల్లు శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లు శిరీష్ చివరిగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఈయనకు తదుపరి సినిమా అవకాశాలు రాలేదు.
సరైన సినిమాల కోసం అల్లు శిరీష్ ఎదురుచూస్తున్నారని చెప్పాలి.