ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్... బన్నీ క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈయన ఫ్యామిలీతో తన వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.

 Allu Arjun Latest Family Photo Goes Viral , Allu Arjun, Social Media, Sneha Red-TeluguStop.com

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే గత కొద్ది రోజులుగా ఈయన తన సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారని చెప్పాలి.

వరుణ్ తేజ్ ( Varun Tej ) పెళ్లి కావడంతో మెగా హీరోలు అందరూ కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.ఇక పెళ్లి తర్వాత వెంటనే దీపావళి రావడంతో దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా షూటింగుకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.

ఒకవైపు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలోనూ మరోవైపు దీవాలి సెలబ్రేషన్స్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు స్నేహారెడ్డి( Sneha Reddy ) తో పాటు అర్జున్ కూడా షేర్ చేసినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.ఇందులో అల్లు అర్జున్ తన కుమారుడిని ఎత్తుకొని ఉండగా స్నేహ రెడ్డి తన కూతురిని కౌగిలించుకొని కనిపించారు.అయితే ఈ ఫోటోలో ఈ నలుగురు చాలా స్టైలిష్ లుక్ లో కనిపించి సందడి చేశారు.

అల్లు అర్జున్ ఇద్దరు కూడా బ్లాక్ సూట్ ధరించి కనిపించగా అర్హ సైతం డిజైనర్ ఫ్రాక్ ధరించి కనిపించారు.స్నేహ రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుకాల్కర్ డిజైన్ చేసినటువంటి వైట్ కలర్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ చిల్డ్రన్స్ డే ( Happy Children’s Day ) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఇది కదా పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ అంటే అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోలు పై కామెంట్ చేస్తున్నారు.

ఇలా ఈ ఫోటోలో ఈ నలుగురు చాలా రాయల్ లుక్ లో కనిపించారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube