అఖిల్ తో సినిమా విషయంలో చైతూ ఇలా అనేశాడేంటీ!

టాలీవుడ్‌ లో మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ముఖ్యంగా ఫ్యామిలీ మల్టీ స్టారర్ సినిమా ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Akkineni Heroes Naga Chaitanya And Akhil Multi Starrer Movie , Akhil, Akkineni F-TeluguStop.com

అందుకే మంచు వారు లేదా మరెవ్వరైనా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ లతో వస్తే తెగ చూసేస్తారు.సినిమా టాక్ తో సంబంధం లేకుండా చూసేస్తారు.

ఆచార్య సినిమా ప్లాప్ అయినా కూడా చిరంజీవి మరియు చరణ్‌ నటించడం వల్ల ఎంతగా ఆధరించారో మనం చూశాం.ఆ సినిమా అంతో ఇంతో రాబట్టింది అంటే ఇద్దరు కలిసి నటించడమే.

అందుకే అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మళ్లీ మనం తరహా మల్టీ స్టారర్ కావాలని కోరుకుంటున్నారు.అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది క్లారిటీ లేదు.

మనం లో ఏయన్నార్‌ నటించారు.ఆయన లేని లోటును అఖిల్ భర్తీ చేసి ఆయన ప్లేస్‌ లో నటిస్తే బాగుంటుందేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

థాంక్యూ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా నాగ చైతన్య మాట్లాడుతూ మల్టీ స్టారర్‌ సినిమా ల విషయంలో చాలా పాజిటివ్ వ్యాఖ్యలు చేశాడు.

కాని అఖిల్ తో సినిమా విషయం లో మాత్రం కాస్త విభిన్నంగా స్పందించాడు.అఖిల్ తో సినిమా అంటే కథ చాలా స్పెషల్‌ గా ఉండాలి.ఇద్దరం కలిసి ఖచ్చితంగా సినిమా చేయాలని నాకు కూడా ఉంది.కాని కథ అంత సులభంగా దొరుకుతుందని నేను అనుకోవడం లేదు అన్నట్లుగా ముందుగానే కథ విషయంలో రచయితలకు మరియు దర్శకులకు వార్నింగ్‌ ఇచ్చినట్లుగా చెప్పేశాడు.

ప్రతి సినిమా కూడా మనం వంటి కథతో రావాలంటే కష్టం.కనుక కొన్ని సార్లు కథ విషయంలో పట్టు విడుపు ఉండాలని.

స్పెషల్‌ కథ అనే విషయం పక్కన పెట్టి అఖిల్‌ తో సినిమా చేసేందుకు మంచి కథ ను ఎంపిక చేసుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube