అఖిల్ అక్కినేని( Akkineni Akhil ) హీరో గా సురేందర్ రెడ్డి( Director Surendar Reddy ) దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ చిత్రం( Agent Movie ) మరికొన్ని గంటల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.అనిల్ సుంకర ఈ సినిమాను దాదాపుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సినిమా కు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని వార్తలు కూడా వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఏజెంట్ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతుంది, కొన్ని కారణాల వల్ల మళ్లీ మళ్లీ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది.ఆ కారణం గా సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగి పోయింది.
సినిమా ను కొన్ని నెలల క్రితమే అమ్మేశాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.అంత ముందు అమ్మడం వల్లే సినిమా కు ఫ్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ అయ్యిందని.
ప్రస్తుతం ఉన్న బజ్ నేపథ్యం లో ఇప్పుడు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉంటే తప్పకుండా ఎక్కువ మొత్తం రాబట్టేది అనే అభిప్రాయాన్ని కొందరు యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా లో అఖిల్ చాలా విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నాడు.ఉత్తరాది ముద్దుగుమ్మ సాక్షి వైద్య హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గత సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాబోతుంది.
ఈ సినిమా లో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
సురేందర్ రెడ్డి గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి.కనుక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది.ఈ సినిమా తో అయినా అక్కినేని హీరో అఖిల్ కి మొదటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడబోతుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల వరంగల్ లో జరిగిన ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున హాజరు అయిన విషయం తెల్సిందే.