ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన జపాన్( Japan ) రాకెట్ ప్రయోగం బెడిసికొట్టింది.ఈ మంగళవారం జపాన్‌కు చెందిన ప్రముఖ ప్రైవేటు సంస్థ ‘ఐ స్పేస్‘( Ispace ) చంద్రుడి మీద ఓ లాండర్ను దించేందుకు యత్నించింది.
అయితే ఈ ప్రయత్నం తృటిలో విఫలమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.చందమామ మీద సదరు వ్యోమనౌక దిగడానికి కొద్ది సేపటి ముందే భూ కేంద్రానికి, ఆ వ్య్యోమనౌకకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు భోగట్టా.
ఈ క్రమంలో ఆ లాండర్ చంద్రుడి మీద దిగలేకపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.ఈ ల్యాండింగ్ ప్రయోగం కనక సక్సెస్ అయినట్లయితే చంద్రుడి మీద వ్యోమ నౌకను దింపిన తొలి జపాన్ ప్రైవేట్ కంపెనీగా ‘ఐస్పేస్’ చరిత్ర సృష్టించేది.కానీ అలా జరగకపోవడం దురదృష్టకరం అని జపాన్ పేర్కొంది.ఇకపోతే ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండర్లను దింపిన ఘనత రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే దక్కింది.
అక్కడి ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థలు విజయవంతంగా చందురునిపైన లండర్లు దింపాయి.అవిగాక మరేదేశము ఇంతవరకు చంద్రునిపైన లాండర్స్ దింపిన దాఖలాలు లేవు.కాగా, గత సంవత్సరం డిసెంబర్‌లో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్( Falcon 9 )లో ప్రయోగించిన తర్వాత నెల రోజుల క్రితమే ఈ వ్యోమనౌక చంద్ర కక్ష్యలోకి పంపడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అయితే, ల్యాండింగ్ ప్రయత్నం సమయంలో కమ్యూనికేషన్ బ్లాక్ చేయబడింది.అది లక్ష్యానికి చేరుకుందని అనుకరణ చూపినప్పటికీ, ఆ తర్వాత అది విఫలం అయినట్టు నిర్దారించుకున్నారు.ఈ విషయమై ఐ స్పేస్ బృందం మాట్లాడుతూ… మేము ఇంతటితో కృంగిపోము… ఇదే మా విజయానికి తొలిమెట్టుగా భావిస్తామని చెప్పుకొచ్చారు.