Ajahar : దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్ ఇద్దరి మరణంలోనూ ఒకటే కారణం..?

ఇస్లామిస్ట్, తీవ్రవాది, పాక్‌ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్( Masood Azhar ) జనవరి 1న చనిపోయాడని ప్రస్తుతం బలంగా వార్తలు వస్తున్నాయి.అతను సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్‌లోని ఓ మసీదు నుంచి తిరిగి వస్తుండగా బాంబు దాడు జరిగిందని, అందులో తీవ్రంగా గాయపడిన మసూద్ తీవ్ర బాధతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

 Ajahar And Davood Ibrahim Death Reason-TeluguStop.com

అయితే గతంలో దావూద్ ఇబ్రహీం( Dawood Ibrahim ) చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి.ఆ సమయంలో ఎలా ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయో ఇప్పుడు కూడా అలానే వైరల్ అవుతున్నాయి.

ఈ దాడిలోనే మసూద్ అజహర్ మరణించాడని ఆరోపిస్తున్నారు.

Telugu Ajahar, Antony Blinken, Davood Ibrahim, Dawood Ibrahim, Jaish Mohammed, M

అయితే విశ్లేషకులు వీరిద్దరూ చనిపోవడం వెనక ఒకటే కారణం ఉందని అంటున్నారు.దావూద్ ఇబ్రహీం విషప్రయోగం వల్ల చనిపోవడానికి, మసూద్ అజహర్ బాంబు దాడి జరగడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్( Pakistan Army Chief Asim Munir ) అమెరికా పర్యటనే కారణమని అంటున్నారు.మునీర్ ఒక సంవత్సరం నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే చివరికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మునీర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ని కలవడానికి మొదట అమెరికా నిరాకరించింది.తర్వాత ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో డిస్కషన్ చేయడమే మంచిదని భావించి బ్లింకెన్‌తో భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telugu Ajahar, Antony Blinken, Davood Ibrahim, Dawood Ibrahim, Jaish Mohammed, M

ఈ మంత్రికి కలిసిన తర్వాత మునీర్ పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్‌తో ( Pentagon chief Lloyd Austin )కూడా చర్చలు జరిపాడు.అయితే ఈ ఇద్దరి కీలక వ్యక్తులు మునీర్‌కు ఎలాంటి హామీలు ఇవ్వలేదు.పాకిస్థాన్‌లో ఉన్న టెర్రర్ గ్రూపులను పాతాళంలోకి తొక్కితేనే హామీలు ఇచ్చేందుకు ఆలోచిస్తామని కరాకండిగా చెప్పేశారు.ఈ ఒత్తిడి వల్లే మునీర్‌ ఆదేశాలతో దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని కొంతమంది విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు.

మునీర్ అమెరికాలో ఉన్నప్పుడు ఈ వార్తలు వచ్చాయి.అతడు తిరిగి పాకిస్థాన్ కి వచ్చాక మసూద్ అజహర్ చనిపోయాడని న్యూస్ బయటికి వచ్చింది.ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ అప్పులు ఇవ్వని తరుణంలో ISI సొంత టెర్రర్ గ్రూపులను తన చేతులతోనే అంతం చేసుకుంటుందని తెలుస్తోంది.దావూద్, మసూద్ అజహర్ చనిపోవడానికి ముందు కొత్త రాజకీయ పార్టీలు పెడతామని ప్రకటించడం గమనార్హం.

వీరిద్దరి హత్యల విషయంలో పాకిస్తానీ గూఢచార సంస్థ ISI ఇప్పటివరకు పెదవి మెదపలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube