టాలీవుడ్‌ ను కంగారు పెడుతున్న కేసీఆర్‌ సెలవుల నిర్ణయం

టాలీవుడ్‌ లో ఇటీవలే సినిమాల సందడి మొదలు అయ్యింది.గత ఏడాది నవంబర్ నుండి సినిమా ల విడుదల హడావుడి కనిపిస్తుంది.2020 సంవత్సరం మార్చి నుండి ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా లు అనేవి విడుదల సాధ్యం కాలేదు.చిన్నా చితకా సినిమా లు విడుదల అయినా బాక్సాఫీస్ సందడి కనిపించలేదు.

 Again Covid Effect On Tollywood Movies Release Details, Kcr Decision, Cm Kcr, Co-TeluguStop.com

ఇలాంటి సమయం లో నాని మరియు బాలయ్య సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇదే సమయం లో పుష్ప సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇలాంటి సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ కు ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే ఉత్తరాదిన ఆంక్షల కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్ మరియు రాధే శ్యామ్‌ సినిమా లు నిలిచి పోయాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పై ఫోకస్‌ పెట్టిన సినిమా లు సంక్రాంతి కి విడుదల అవ్వాలనుకుంటే తెలంగాణలో థియేటర్ల వద్ద ఆంక్షలు తప్పవా అన్నట్లు గా ప్రచారం మొదలు అయ్యింది.కేసీఆర్ తాజాగా విద్యా సంస్థ లకు ఏకంగా పది రోజుల వరుస సెలవు దినాలను ప్రకటించాడు.

Telugu Bangarraju, Cm Kcr, Corona, Covid Effect, Covideffect, Covid, Kcr, Omicro

అదే కొనసాగితే థియేటర్ల కు కూడా ఆక్యుపెన్సీ తగ్గించడం లేదంటే మరో రకంగా ఆంక్షలు పెడితే థియేటర్ల లో సందడి చేయాలనుకుంటున్న సంక్రాంతి సినిమా ల పరిస్థితి ఏంటీ అంటూ ప్రతి ఒక్కరి లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.టాలీవుడ్‌ నుండి సంక్రాంతి కి బంగార్రాజు కాకుండా మరో పది సినిమా లు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.పెద్ద సినిమా లు ఆంక్షలున్నా కూడా ఏదో విధంగా నడుస్తాయి.కాని చిన్న సినిమాలు కరోనా ఆంక్షల మద్య నడవడం అసాధ్యం.అందుకే ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల వారికి కేసీఆర్‌ నిర్ణయం మింగుడు పడటం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube