ఆడపిల్లలకు బయట సమాజంలోని కాదు తల్లి గర్భం లోనూ స్వచ్ఛ లేదు.పిల్లలు పుట్టకముందే ఆడపిల్ల అని తెలిస్తే పసికందు కళ్ళు తెరవకుండానే ఊపిరి తీసేస్తున్నారు.
కొంతమంది పుట్టిన బిడ్డ ఆడ పిల్ల అని తెలియగానే హాస్పిటల్ లో వదిలేసి వెళ్లిపోవడమో, లేదా ఏ చెత్త కుండీలోనో పడేయడమో చేస్తున్నారు.కానీ తూర్పు గోదావరి జిల్లాలో ఓ తల్లి కన్న బిడ్డను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
ఈ కుట్రకు అత్తయ్య ,అమ్మమ్మ కూడా తోడవ్వడం సభ్య సమాజాన్ని తలా దించుకునేల చేసింది.
కొత్తూరులోని ఓ కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల పుట్టింట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
వంశపారపర్యంగా మూడు తరాలుగా ఆడపిల్లలే పుట్టడంతో తల్లి పుట్టింటి వారు ఇష్టపడలేదు.ఇంట్లోని మగవారికి తెలియకుండా ఆ పసికందును హతమార్చాలని మహిళలే కుట్ర పన్నారు.15 రోజులుగా ఎన్నో కుట్రలు పన్నినా చంపే సాహసం చేయలేకపోయారు.బిడ్డకు 21వ రోజు వస్తే ఊయలలో వేసి సంబరాలు చేయాలనే బెంగ వారిలో మొదలైంది.
శుక్రవారం తెల్లవారుజమున బిడ్డను ఎత్తుకుని తల్లి, అమ్మమ్మ, తాతమ్మ ఇంటి పక్కనున్న పాడుబడ్డ బావి వద్దకు చేరుకొని, ముగ్గురు కలిసి పసికందును అందులోకి విసిరేశారు.
తెల్లవారాక బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారంటూ ఇంట్లోని మగవారికి చెప్పి నాటకమాడారు.బాలిక కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు.పసికందు తల్లి(21), అమ్మమ్మ, తాతమ్మ ఈ దురాగతానికి ఒడిగట్టారని తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్టు అంగీకరించారు.వరుసగా మూడు తరాల ఆడపిల్లలు పుట్టడంతో ఈసారి కూడా ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేకే ఇలా చేసినట్టు ఒప్పుకున్నారు.
మనవత్వం లేకుండా ఇలా చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.కోరుకొండ డీఎస్పీ పీఎస్‌ఎన్ రావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి శనివారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.