అక్కడ 'ఆదిపురుష్' ప్రీమియర్ క్యాన్సిల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ ”ఆదిపురుష్( Adipurush )”.ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Adipurush Makers Takes The Best Decision By Cancelled The Premiers, Adipurush, A-TeluguStop.com

మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అందుకే మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని ఎంత వీలైతే అంత ఎక్కువుగా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas )రాముడిగా నటిస్తే.కృతి సనన్( Kriti Sanon ) సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటిస్తున్నారు.

మరి ఈ భారీ సినిమా నుండి ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ మంచి ట్రీట్ ఇచ్చాడు అనే చెప్పాలి.

ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా మార్చేశాడు.

ఇక ఈ సినిమాను జూన్ 13న ట్రిబాక ఫిలిం ఫెస్టివల్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షో అక్కడ క్యాన్సిల్ అయినట్టు టాక్.ఎందుకు క్యాన్సిల్ చేసారో తెలియదు కానీ జూన్ 13న ఫస్ట్ షోస్ పడనుండగా ఆ షోను రద్దు చేశారట.

అయితే జూన్ 15, 16 మాత్రం షోలు ఉంటాయి అనేది తెలుస్తుంది.
.

మరి జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి.ఈ సినిమా ముందు నుండి నెగిటివ్ ఇంప్రెషన్ అందుకున్న కారణంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అని అంతా ఆతృతగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube