అక్కడ ‘ఆదిపురుష్’ ప్రీమియర్ క్యాన్సిల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ ''ఆదిపురుష్( Adipurush )''.

ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అందుకే మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని ఎంత వీలైతే అంత ఎక్కువుగా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas )రాముడిగా నటిస్తే.

కృతి సనన్( Kriti Sanon ) సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటిస్తున్నారు.

మరి ఈ భారీ సినిమా నుండి ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ మంచి ట్రీట్ ఇచ్చాడు అనే చెప్పాలి.

ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా మార్చేశాడు.

"""/" / ఇక ఈ సినిమాను జూన్ 13న ట్రిబాక ఫిలిం ఫెస్టివల్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షో అక్కడ క్యాన్సిల్ అయినట్టు టాక్.

ఎందుకు క్యాన్సిల్ చేసారో తెలియదు కానీ జూన్ 13న ఫస్ట్ షోస్ పడనుండగా ఆ షోను రద్దు చేశారట.

అయితే జూన్ 15, 16 మాత్రం షోలు ఉంటాయి అనేది తెలుస్తుంది. """/" / మరి జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.

ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి.ఈ సినిమా ముందు నుండి నెగిటివ్ ఇంప్రెషన్ అందుకున్న కారణంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అని అంతా ఆతృతగా చూస్తున్నారు.

నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్