నా భర్త, పిల్లలకోసం ఏడవటం లేదు.. నటి సుధ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సుధ సినిమాలలో కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అటు సీనియర్ హీరోలతో పాటు ఇటు యంగ్ జనరేషన్ హీరోలకు సైతం సుధ తల్లి పాత్రలలో ఎక్కువగా నటించారు.

 Actress Sudha Shocking Comments About Husband And Son Details, Actress Sudha, Actress Sudha Comments, Husband And Son , Actress Sudha Struggles, Mother Roles-TeluguStop.com

వందల సంఖ్యలో సినిమాలలో నటించిన సుధ సినిమాల ద్వారా ఆర్థికంగా కూడా స్థిరపడ్డారని సమాచారం.అయితే సినిమాల్లో ఉండే కష్టాలా తన రియల్ లైఫ్ లో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని సుధ చెప్పుకొచ్చారు.

సినిమాల ద్వారా తాను చాలా ఎక్కువమొత్తం సంపాదించుకున్నానని అయితే ఆ డబ్బులలో చాలా మొత్తం వ్యాపారాలు చేయడం ద్వారా పోగొట్టుకున్నానని సుధ కామెంట్లు చేశారు.ఢిల్లీలో ఒక హోటల్ పెడితే లాభాలు వచ్చాయని హోటల్ వ్యాపారంలో సక్సెస్ కావడంతో మరో హోటల్ పెట్టామని సుధ చెప్పుకొచ్చారు.

 Actress Sudha Shocking Comments About Husband And Son Details, Actress Sudha, Actress Sudha Comments, Husband And Son , Actress Sudha Struggles, Mother Roles-నా భర్త, పిల్లలకోసం ఏడవటం లేదు.. నటి సుధ షాకింగ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ హోటల్ లో మాత్రం నష్టాలు వచ్చాయని సుధ పేర్కొన్నారు.చిన్నప్పుడే అమ్మ గుండెపోటుతో చనిపోయిందని సుధ తెలిపారు.

అమ్మ చనిపోయిన తర్వాత తాను నాన్నను చూసుకున్నానని నాన్న చనిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో అర్థమైందని సుధ వెల్లడించారు.

నాన్న క్యాన్సర్ చికిత్స కొరకు ఆస్తులన్నీ కరిగిపోయాయని సుధ పేర్కొన్నారు.భర్త, కొడుకు ప్రస్తుతం తనకు దూరంగా అమెరికాలో ఉన్నారని సుధ అన్నారు.నా కూతురికి పెళ్లైందని మాతృదేవోభవ సినిమాలోని చాలా ఘటనలు రియల్ లైఫ్ లో జరిగినవే అని ఆమె చెప్పుకొచ్చారు.

తన భర్త, కొడుకుకు జీవితం అంటే ఏంటో తెలియదని వాళ్ల కొరకు తాను ఏడవడం లేదని ఆమె అన్నారు.ఈ విషయాలను చెబుతూ సుధ ఎమోషనల్ అయ్యారు.మనవరాలు పిలుపు వింటే తనకు అమ్మ గుర్తుకువస్తారని సుధ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.సుధ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Sudha Shocking Comments About Husband And Son Details, Actress Sudha, Actress Sudha Comments, Husband And Son , Actress Sudha Struggles, Mother Roles - Telugu Actress Sudha, Actresssudha, Son, Mother, Sudha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube