తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎప్పటికీ తరగని అందం శ్రీదేవి ( Sridevi )సొంతం.
మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తన అందం అభినయంతో సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్లు పాట ఒక వెలుగు వెలిగింది.తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ పాన్ ఇండియా భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీదేవి.
అంతేకాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమె వెళ్లిపోయిన కూడా ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందే మెదులుతూనే ఉన్నాయి.అయితే శ్రీదేవికి ఆఖరి కోరికగా ఒక కోరిక మిగిలిపోయిందట.
ఆ కోరికను ఆమె కలను తాజాగా ఆమె భర్త బోని కపూర్ ఫుల్ ఫిల్ చేశారు.కాగా శ్రీదేవి 80ల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో చెన్నైకి దగ్గర లోని మహాబలిపురం( Mahabalipuram ) ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసిందట.
అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది.
చాలా ఆశపడింది.కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది.దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది.
శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్ ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్‌నర్‌షిప్‌తో అందమైన భవనం కట్టించారు.
ఇది శ్రీదేవి కల.అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్ పనులు చేశాము.ఫైనల్‌గా బీచ్ హౌస్‌ని పూర్తి చేశాము.చాలా ఆనందంగా ఉంది అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు.