తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్( Actress Anasuya Bhardwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్ గా తన సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. దాంతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను చూసిన మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది అనసూయ.
ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ ఏడుస్తూ ఎమోషనల్ అయిన వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ తను బాగానే ఉన్నాను అంటూ మరొక వీడియోని షేర్ చేయడంతో అవి అనేక చర్చలకు దారి తీసాయి.ఇదిలా ఉంటే తరచూ సెలబ్రిటీలకు ( celebrities )సంబంధించిన జాతకాలను బయటపెడుతూ సోషల్ మీడియాలో నిలిచే వేణు స్వామి గతంలో అనసూయ జాతకం గురించి చేసిన కామెంట్లు తెరపైకి వచ్చాయి.ఇంతకీ వేణు స్వామి( venu swami ) అనసూయ గురించి ఏం చెప్పాడు అన్న వివరాల్లోకి వెళితే.2021 తర్వాత అనసూయ జాతకం మారనుంది.ఆమెకు తిరుగు ఉండదు.చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.అలాగే ఆమె రాజకీయాల్లోకి కూడా రావచ్చు అని వెల్లడించారు.
ఇప్పుడు ఈ మాటలు నిజమని తెలుస్తోంది.ఎందుకంటే 2021 తర్వాత అనసూయ క్రేజ్ రెట్టింపు అయింది.ఆమె బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది.
పుష్ప సినిమాతో ఆమెకు మరింత క్రేజ్, పాపులారిటి అయితే వచ్చింది.ఇక వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
ఆయన చెప్పినట్లుగానే ఫ్యూచర్ లో అనసూయ రాజకీయాల్లోకి వచ్చిన ఆశ్చర్యం ఉండదు.అయితే ఇప్పటికే అనసూయ విషయంలో వేణు స్వామి చెప్పిన మాటలు అని నిజం కావడంతో త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా ఖాయం అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరి ఈ వ్యాఖ్యలపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.