తెలుగు ప్రేక్షకులకు తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె మొదట ఈ ముద్దుగుమ్మ రామన్ రాఘన్ 2.0 అనే ఒక హిందీ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత గూడచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ హీరోయిన్ శోభితకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు నాలుగేళ్లకు మేజర్ సినిమా( Major )తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఆ తర్వాత మధ్య మధ్యలో హిందీ మలయాళ సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.శోబిత సినిమాలలో( Sobhita dhuli pala ) నటించకపోయినప్పటికీ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.అయితే మామూలుగా చాలామంది హీరోయిన్లు లక్ వల్ల హీరోయిన్లుగా మారామని చెబుతూ ఉంటారు.కానీ హీరోయిన్ శోభిత మాత్రం ఒక కాయిన్ వల్ల హీరోయిన్ గా మారిపోయిందట.
అసలు కాయిన్ కు హీరోయిన్ శోభితకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా.అయితే ఇది తెలుసుకోవాల్సిందే.
కాగా ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తోంది శోభిత.మొదట చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.
2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.ఇది జరిగిన మూడేళ్లకు హిందీ సినిమా రమణ్ రాఘవ్ 2.0 సినిమాతో హీరోయిన్ అయిపోయింది.ఆ తర్వాత హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లో వరస చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న శోభిత( The Kapil Sharma Show ) తన కెరీర్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
వైజాగ్ లో చదువు పూర్తయిన తర్వాత పెద్ద సిటీకి వెళ్లాలని అనుకున్నాను అప్పుడు నా ఛాయిస్ బెంగుళూరు, ముంబై.ఈ రెంటింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు కాయిన్ తో టాస్ వేశాను.
ముంబై ఛాయిస్ గా వచ్చింది.వెంటనే అక్కడికి వెళ్లాను.
నా లైఫ్ మొత్తం మారిపోయింది అని శోభిత చెప్పుకొచ్చింది.