సిగరెట్ ( Cigarette ) తాగడం ఆరోగ్యానికి హానికరం.ఈ యాడ్ ని మనం నిత్యం వింటూనే ఉంటాం.
సినిమాల్లో కూడా ఈ యాడ్ ని కచ్చితంగా వేస్తుంటారు.సిగరెట్ తాగడం ప్రమాదమని తెలిసినా కొంతమంది మనలేకపోతుంటారు.అంతేకాదు రోజురోజుకి కొత్త బ్రాండ్లు కూడా తయారవుతున్నాయి.50 శాతం మంది సిగరెట్ లు తాగుతున్నారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.అంతే కాదు ఎప్పుడు సిగరెట్ హానికరం అని వింటుంటాం, కానీ సిగరెట్ ఖరీదైనది కూడా.అవును మనం ఎక్కువగా రూపాయల్లో ఉండే సిగరెట్ ధరలనే విన్నాం.కానీ సిగరెట్ ప్యాకెట్ ధర వేలల్లో ఉన్నాయి.ముఖ్యం కొన్ని బ్రాండ్ల ధరలు అయితే అందరికి షాక్ కి గురిచేస్తున్నాయి.
ఇప్పుడు మనం ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన సిగరెట్ల గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ బ్రాండ్ ట్రెజరర్.( Treasurer ) ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు రూ.4500లు. ఇది విన్న వారందరు షాక్ అవుతున్నారు.అయితే ఈ కంపెనీ ఇంగ్లండ్‌కు చెందింది.ఒక సిగరెట్ ప్యాకెట్ ఇంత ధర ఉంటుందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.ఆ తరువాత మరో ఖరీదైన బ్రాండ్ సోబ్రాణి సిగరెట్.
( Sobrane Cigarette ) ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 800 నుండి 1200 రూపాయల మధ్యలో ఉంటుంది.అంతే కాదు ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రారంభించింది కాదు.
ఈ బ్రాండ్ సిగరెట్ 1879లో ప్రారంభించబడింది.
ఇది ఒక పురాతనమైన బ్రాండ్ అని చెప్పవచ్చు.ఆ తరువాత మరో బ్రాండ్ పార్లమెంట్ సిగరెట్.( Parliament Cigarette ) ఈ బ్రాండ్ సిగరెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఈ సిగరెట్ ప్యాకెట్ ధర రూ.350 నుంచి రూ.600 మధ్యలో ఉంటుందట.ఈ బ్రాండ్ సిగరెట్ లు మూడు రకాల ప్యాకెట్ లలో దొరుకుతుంది.
ఆ తరువాత అత్యంత ఖరీదైన బ్రాండ్ లలో నాట్ షెర్మాన్ సిగరెట్( Net Sherman Cigarette ) ఒకటి.ఇది కూడా ఇప్పుడు స్థాపించింది కాదు.ఈ బ్రాండ్ ని 1930 లో స్థాపించారు.
ఈ ప్యాకెట్ ధర దాదాపు 700 రూపాయలు.ఇక ఖరీదైన బ్రాండ్ లలో చివరిది డేవిడ్‌ఆఫ్ సిగరెట్.( Davidoff Cigarette ) ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 1000 రూపాయలు.
అంతేకాదు ఈ సిగరెట్ లు అత్యంత బిన్నంగా ఉంటాయట.ఖరీదైన ఈ సిగరెట్ స్విస్ బ్రాండ్.
ఈ ఐదు బ్రాండ్లు ఇప్పుడు ప్రపంచంలోనే ఖరీదైనవి అని సమాచారం.ఒకప్పుడు సిగరెట్ అంటే చాలా చవకగా దొరికేది.
కానీ ఇప్పుడు పొగాకు హానికరం మాత్రమే కాదు ఖరీదైన వస్తువుగా మారిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.