Tamannaah Bhatia : థమన్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన తమన్నా.. నువ్వు నాలో సగం అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా ( Tamannaah Bhatia )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 Tamannaah Interesting Comments On Music Director Thaman Viral Now-TeluguStop.com

సినిమాలు, వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

కాగా అభిమానులు తమన్నాని ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుస్తారు.ఆ ట్యాగ్‌ చాలా పాపులర్ అయిపోవడంతో ఇప్పుడు ఏకంగా మిల్కీ బ్యూటీ పేరుతో పాటనే తీసుకొచ్చారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Thaman, Tamannaah, Tollywood-Movie

అది కూడా చిరంజీవి సినిమాలో పెట్టారు.చిరంజీవి ( Chiranjeevi )హీరోగా నటిస్తున్న భోళాశంకర్‌ ( Bhola shankar )చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ అనే పేరుతోనే పాటని పెట్టారు.సాగర్‌ మహతి సంగీతం అందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు.చిరంజీవి, తమన్నాలపై వచ్చే మంచి కూల్‌ మెలోడీ సాంగ్‌ ఇది.విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటుంది.యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.ఈ పాటని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ.ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ప్రారంభంలోనే తనని మిల్కీ బ్యూటీ అని పిలిచేవారు.అలా ఎందుకు పిలుస్తున్నారో మొదట అర్థమయ్యేది కాదు, నా కలర్ గురించి అలా పిలుస్తున్నారని తెలిసింది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Thaman, Tamannaah, Tollywood-Movie

అయితే కేవలం కలర్‌ని ప్రతిబింబించేలా అలా పిలవడం లేదు, అందులో ఆడియెన్స్ లో నాపై ఉన్న ప్రేమని వాళ్లు అలా వ్యక్తం చేస్తున్నారు.అందుకు చాలా సంతోషంగా ఉంది.ఆ ప్రేమని ఇన్నాళ్లు అందిస్తూనే ఉన్నారు.ఇందులో చిరంజీవిగారి తో నటించడం, పైగా తన పేరుతో రాసిన పాటకి చిరంజీవితో స్టెప్పులేయడం చాలా హ్యాపీగా ఉంది అని తెలిపింది తమన్నా.

అనంతరం మ్యూజిక్‌ డైరెక్టర్‌పై తమన్‌ ప్రశంసలు కురిపిస్తూ.తమన్ కి నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి.ఆయన నాకు థ్యాంక్స్ చెబుతుంటారు.ఎందుకంటే నువ్వు నాలో సగం.సెట్‌లో చిరంజీవి గా ఎప్పుడూ తమన్‌ అంటూ నన్ను పిలుస్తుంటారు.ఆ కారణంతో సెట్‌లో నువ్వు కూడా ఉన్నావనే భావన కలుగుతుంది.

నువ్వు లేకపోతే అందరి లైఫ్‌ ఇన్‌ కంప్లీట్‌గా అనిపిస్తుంది.ఎందుకంటే నీ పాటలతో అందరిని ప్రభావితం చేస్తావు అంటూ ప్రశంసలు కురిపించింది తమన్నా.

ఈ సందర్భంగా తమన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube