ఆ నిబంధన వల్ల రోజా జబర్దస్త్ కు దూరమయ్యారా.. అదే నిజమంటూ?

జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి రోజా ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఈ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి రోజా కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.

 Actress Roja Good Bye To Jabardast Show Details Here ,  Good Bye To Jabardasth ,-TeluguStop.com

రోజాకు మంత్రి పదవి దక్కడంతో ఆమె జబర్దస్త్ షోకు దూరమవుతున్నానని వెల్లడించారు.మంత్రి అవుతున్నందుకు షూటింగ్ లు మానేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపై టీవీ ప్రోగ్రామ్ లలో కనిపించనని షూటింగ్ లలో పాల్గొననని ఆమె చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తనకు ఇచ్చిన గుర్తింపును ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చెప్పారని జగన్ మాత్రం తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు మంత్రిని చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.మహిళా పక్షపాత సీఎం కేబినెట్ లో మంత్రిగా పని చేయడం తన లక్ అని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే రోజా జబర్దస్త్ కు దూరం కావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది.

మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఆదాయం సమకూర్చే ఇతర రంగాలలో ఉండకూడదని నిబంధన ఉంది.ఆ నిబంధన వల్ల కూడా రోజా ఈ షోకు దూరం కానున్నారని తెలుస్తోంది.

రోజా ఈ షోకు దూరమవుతున్న నేపథ్యంలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu Chandrababu, Cm Jagan, Bye Jabardasth, Jabardast Show, Jabardasth, Roja,

గత కొన్ని వారాలుగా రోజా జబర్దస్త్ షోలో ఎక్కువగా కనిపించడం లేదు.మరోవైపు పలువురు కమెడియన్లు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోను వీడుతున్నారు.రోజాకు మంత్రి పదవి రావడం వల్ల జబర్దస్త్ షోకు మాత్రం ఒక విధంగా నష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు గత కొన్నివారాలుగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల రేటింగ్స్ తగ్గుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube