వెండితెర మీద కనిపించాలి అని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది.అయితే అక్కడికి వెళ్లి సినిమాలో ప్రయత్నాలు చేయాలంటే మాత్రం అందరు భయపడిపోతారు.
ఎందుకంటే సినిమా కష్టం ఎలా ఉంటుంది, అంటే దానికంటే ఉరి శిక్ష పడిన ఖైదీ జీవితమే బెటర్ అనుకునేలా ఉంటుంది.ఎందుకంటే సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలీదు.
ఇండస్ట్రీ లో ఎవరైనా తెలిసినవాళ్ళు ఉంటె ఏం కాదు కానీ లేకపోతే మాత్రం వాళ్ళ పరిస్థితి అంతే ఆఫీస్ లా చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరగాల్సిందే తప్ప ఇక్కడ అవకాశం ఇచ్చే వాళ్ళు మాత్రం ఉండరు.ఒక అవకాశం రావడానికి కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న కళాకారులు ఉన్నారు అంటే నమ్ముతారా.
ఒకేవేళ అవకాశం వచ్చిన ఏదో చిన్నది అయి ఉంటుంది.ఇలా వచ్చి అలా వెళ్లే క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి వాటి వల్ల వాళ్ళకి వచ్చేది ఏం ఉండదు.
అయితే వీళ్లకంటే ఖైదీల పని బెటర్ అని ఎందుకు అన్నాను అంటే కనిసం వాళ్ళకి సమయానికి అన్నం అయినా పెడుతారు, వీళ్లకి అది కూడా ఉండదు ఒకరోజు తింటే ఇంకో రోజు ఉపవాసం ఉంటారు అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి.అయితే ఒకవేళ మంచి ఛాన్స్ వచ్చి మంచి పేరు వచ్చిన అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు.
అందుకే ఇక్కడకి రావడానికి చాలామంది భయపడతారు.ఇలా చాలామంది వచ్చి ఇండస్ట్రీ లో ఎదిగి తొందరగానే ఫేడవుట్ అయి వెళ్లిపోయారు.అలాంటి వారు చాలామంది ఉన్న వాళ్లలో ఒకరి గురించి ఇప్పుడు మనం చూద్దాం…
తరుణ్ అందరికి తెలిసిన హీరోనే నువ్వేకావాలి మూవీ తో హీరోగా పరిచయం అయ్యాడు.తర్వాత నువ్వులేక నేనులేను సినిమా తో ఒక మంచి హిట్ అందుకొని ఒక మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ గా పరిచయం అవుతూ తరుణ్ తో తీసిన సినిమా నువ్వే నువ్వే ఇది మంచి హిట్ అవ్వడం తో తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది.అయితే తరుణ్ బాలనటుడుగా కూడా కొన్ని సినిమాలు చేసాడు.
బాలకృష్ణతో ఆదిత్య 369 మూవీ చేయగా, వెంకటేష్ తో సూర్య IPS మూవీ చేసాడు.అయితే తరుణ్ నువ్వులేక నేనులేను మూవీ చేసినపుడు అతనికి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పరిచయం అయింది.
అలా వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది.అలా వాళ్ళు ప్రేమలో ఉన్నపుడు డైరెక్టర్ రవిబాబు తీసిన సోగ్గాడు మూవీలో మళ్ళి ఇద్దరు కలిసి నటించారు.
అయితే ఏం జరిగిందో తెలీదు కానీ వాళ్ళ ప్రేమ పెళ్లిదాక పోలేదు.దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్తి అగర్వాల్ సుసైడ్ అటెంప్ట్ చేసింది.
ఇలా పలు విషయాలతో తరుణ్ వార్తల్లో నిలవడం వల్ల ఆయనకి రావాల్సిన అవకాశాలు సరిగా రాలేదు అని చెప్పాలి.అలా నిదానంగా తరుణ్ ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయిపోయాడు.
అయితే తరుణ్ వాళ్ళ అమ్మ రోజా రమణి కూడా ఒకపుడు మంచి నటి.పలు సినిమాల్లో కూడా ఆక్ట్ చేసింది ఇంకా కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది.
అయితే తరుణ్ వాళ్ల అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా యాక్టర్ అని చాలామంది కి తెలియదు.ఆయన యాక్టర్ మాత్రమే కాదు పెద్ద హీరో కూడా అవునా అని ఆశ్చర్య పొతున్నారా అయితే అయన పెద్ద హీరో అనేది నిజం.కానీ అది ఇక్కడ కాదు ఒరియాలో ఈయన అసలు పేరు రామకృష్ణ ఈయన చిరంజీవి, రాజేంద్రప్రసాద్ లాంటి వారితో ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు తెలుగు సినిమాలు చేసిన తనకి పెద్దగా గుర్తింపు రాలేదు.ఒక సినిమాకి గాను M.S రెడ్డి గారు రామకృష్ణగా ఉన్న అయన పేరుని చక్రపాణిగా మార్చారు.ఇక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో చక్రపాణి గారు ఒరియాలో మూవీస్ చేసి అక్కడ టాప్ హీరో అయ్యారు.
వరసగా తెలుగులో హిట్ అయినా ఎన్టీఆర్ సినిమాలని అక్కడ రీమేక్ చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొట్టాడు.అయితే తనతో పాటు ఆక్ట్ చేసిన రోజా రమణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వాళ్ళకి తరుణ్ జన్మించాడు.ఇలా ఒక ఇండస్ట్రీ లో పేరు రాకపోయినా ఇంకో ఇండస్ట్రీ లో మాత్రం టాప్ హీరో అయ్యాడు మన చక్రపాణి గారు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అప్పుడు కొన్ని బిజనెస్ లు చేసి బాగా నష్టపోయారు.ఒకరోజు అనుకోకుండా రామోజీరావు గారిని కలిసిన చక్రపాణి గారు ఆయనకి నచ్చడంతో ఒరియా ఈటీవీ హెడ్ గా చక్రపాణి గారిని చేసారు.
ఇక్కడ హీరోలుగా ఎదిగి పడిపోయిన హీరోలని చాలామందిని చూసాం.చక్రపాణి గారి అబ్బాయి అయిన తరుణ్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే.ప్రస్తుతం తరుణ్ సినిమాలు లేక కాలిగా ఉన్నారు.మరి ఫ్యూచర్ లో అయినా ఒక మంచి సినిమా తో వచ్చి మళ్లీ కంబ్యాక్ ఇస్తాడో, లేదో చూద్దాం…
.