తెలుగు సినీ నటుడు బ్రహ్మాజీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరోగా కూడా కొన్ని సినిమాలలో మెప్పించాడు.ఇక ఆ తర్వాత సహాయ పాత్రుడిగా చేయగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాడు.
కామెడీ పరంగా కూడా బ్రహ్మాజీ నటనకు మంచి గుర్తింపు అందింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో తన నటనతో మాత్రం యాక్టివ్ గా ఉన్నాడు.
నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మర్యాద రామన్న, మిరపకాయ్ వంటి పలు సినిమాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
సోషల్ మీడియా ప్రభావం బ్రహ్మాజీ పై కూడా పడింది.
ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు.అంతే కాకుండా తన ఫోటోలను, ఫన్నీ వీడియోలు అభిమానులతో బాగా షేర్ చేసుకుంటాడు.
ఇక ఈయనకు ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది.ఇటీవలే తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయగా అందులో ఎక్స్ ప్రెషన్స్ తో తెగ ఆకట్టుకున్నాడు.
అంతేకాకుండా ఆ వీడియో కాస్త ఫన్నీ గా కూడా కనిపించింది.ఇదిలా ఉంటే చొక్కా లేని ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
తాజాగా బ్రహ్మాజీ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేశాడు.అందులో చొక్కా లేకుండా కనిపించడమే కాకుండా పైగా యాంగ్రీ లుక్ లో బెదిరించినట్లు కనిపించాడు బ్రహ్మాజీ.ఇక ఈ ఫోటోకు నేను ఇంకా అయిపోలేదు అనే అర్థం క్యాప్షన్ ఇవ్వగా.దీనికి అర్థం తనలో ఇంకా విషయం ఉన్నట్లు నటన విషయంలో తనలో శక్తి మరింత ఉంది అన్నట్లు ఇప్పట్లో అయిపోలేదు అన్నట్లు తెలిపాడు.
పైగా తనను వాడుకుంటూ ఉంటే విలన్ పాత్రలో కూడా చేస్తాను అన్నట్లు తన లుక్ ని చూపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా బ్రహ్మాజీ అభిమానులు, నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఆయన నటన గురించి తెగ పొగుడుతున్నారు.