ముంబైలో మరో నటుడు ఆత్మహత్య!

మూడు నెలల క్రితం బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే.ఆ మృతి కేసు ఏ బాలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడిస్తుంటే ఇప్పుడు మరో నటుడు ముంబైలో సూసైడ్ చేసుకోవడం అందరికి షాక్ కి గురి చేస్తుంది.

 Actor Akshat Utkarsh Dies In Suspicious Condition In Mumbai, Actor Akshat Utkars-TeluguStop.com

ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు కీలక మలుపులు తిరుగుతుంటే ఇప్పుడు మరో టీవీ నటుడు దారుణంగా ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.

ఈ టీవీ నటుడు ముంబైలో ఉన్న తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకొని మరించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్ కు చెందిన అక్షిత్ ఉత్కర్ష్ అనే 26 ఏళ్ల టీవీ నటుడు ముంబై లో తన ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే అతడు తన గర్ల్ ఫ్రెండ్ తో ఫ్లాట్ లో ఉంటున్నాడు.ఆదివారం రాత్రి ఉత్కర్ష్ విగతజీవిగా ఉండడం చూసిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో అతడు మానసికంగా కుంగిపోయాడని అందుకే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

కానీ అతని తల్లితండ్రులు మాత్రం తమ కుమారుడుని చంపేసి ఆత్మహత్యల చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరి టీవీ నటుడుగా కొనసాగుతున్న ఉత్కర్ష్ షూటింగ్ ఆగిపోయి మానసికంగా దెబ్బ తినడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక నిజంగా అతని తల్లితండ్రులు అన్నట్టు ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.ఏదిఏమైనా ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యతో విలవిల్లాడుతున్న బాలీవుడ్ ఇప్పుడు ఈ నటుడు ఆత్మహత్యతో వణికిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube