మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో..?

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు సాయికుమార్ కుమారుడే ఆది.మొదటిసారిగా ప్రేమ కావాలి సినిమా తో వెండితెరకు పరిచయమైన ఆది తొలిసారి నటనతో ఈ సినిమాలో మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

 Aadi Sai Kumar Act His Next Film Director Bhaskar Bantupalli  Tollywood, Aadi Sa-TeluguStop.com

ఆ తర్వాత లవ్ లీ, సుకుమారుడు వంటి వరుస సినిమాలలో బాగా నటించారు.కానీ కొన్ని సినిమాలలో ఆది అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

ఇదిలా ఉంటే తాజాగా నడిగట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా శశి.ఈ సినిమాలో ఆది హీరోగా నటించిన సంగతి తెలిసిందే.ఆర్ పీ వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు ఈ సినిమాకు నిర్మాతగా చేయగా ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.ఇక ఈ సినిమా ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకోగా ఆది మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu @aadisaikumar, Aadi Saikumar, Tollywood-Movie

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విడుదలైన శశి సినిమా తో మరో అవకాశాన్ని అందుకున్నాడు ఆది సాయి కుమార్.భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వినిపించగా ఆ సినిమా కథకు అది కూడా ఓకే చేశాడు.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

ఇందులో ఆది సరికొత్త క్యారెక్టరైజేషన్, స్టైలిష్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.శిఖర క్రియేషన్స్ పతాకంపై టీ విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సాకేత్ కొమాండూరి సంగీతాన్ని అందిస్తున్నాడు.ఏ డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటిస్తామని సిని బృందం తెలిపింది.అంతేకాకుండా ఈ సినిమాను ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా ప్రారంభించనున్నారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube