రోహిత్ శర్మ ఖాతాలో ఓ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారతీయుడిగా..!

ఐపీఎల్ లో తాజాగా పంజాబ్ – ముంబై( Punjab Kings ) మధ్య జరిగిన మ్యాచ్లో చివరివరకు పోరాడి ముంబై జట్టు ఓటమిని చవిచూసింది.మ్యాచ్ ఓడినప్పటికీ రోహిత్ శర్మ ఖాతాలో ఓ సరికొత్త రికార్డు పడింది.ఈ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో ఆఫ్ సెంచరీ కోల్పోయాడు.27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.ఐపీఎల్ చరిత్రలో 250 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ( Rohit Sharma ) తొలి భారతీయుడుగా రికార్డ్ సృష్టించాడు.పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో మూడు సిక్స్ లు బాదాడంతో ఈ రికార్డ్ ఖాతాలో పడింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ పై ఉంది.గేల్ 142 మ్యాచ్లలో 357 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ లో అత్యధిక సిక్సులు కొట్టిన మొదటి ఆటగాడుగా నిలిచాడు.ఈ జాబితాలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్( AB de Villiers ) ఉన్నాడు.ఐపీఎల్ లో ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో గేల్ డివిలియర్స్ తర్వాత మూడవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.రోహిత్ శర్మ రెండవ స్థానానికి వెళ్లాలంటే కేవలం 2 సిక్స్లు కొట్టడమే బాకీ ఉంది.

మహేంద్రసింగ్ ధోని 235 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.విరాట్ కోహ్లీ 229 సిక్సర్లు కొట్టి ఐదో స్థానంలో నిలిచాడు.ఇక పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయలేక ఓటమిని చవిచూసింది.ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ సింగ్ రెండు వరుస బంతులకు రెండు వికెట్లు తీసి ముంబై జట్టుకు షాక్ ఇచ్చాడు.215 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి ఓడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube