ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.ఈ వీడియోలో ఒక పెద్ద నాగుపాము ఒక బాలుడిని కాటేయడానికి ప్రయత్నించింది.
అయితే దీనిని చూసిన తల్లి రెప్పపాటు సమయంలో ఆ కాటు పిల్లవాడిపై పడకుండా కాపాడగలిగింది.ఒళ్ళు గగుర్పొడిపించే ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటు చేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే. ఒక తల్లి తన పిల్లాడిని స్కూలుకు పంపించాలని ఇంట్లో నుంచి బయటకు తీసుకు రావడం గమనించవచ్చు.
అయితే ఆ ఇంటి ముందు చాలా పొడవైన మెట్లున్నాయి.సరిగ్గా ఆ మెట్ల కిందకి ఒక పెద్ద నాగుపాము పాక్కుంటూ వచ్చింది.
అయితే ఈ నాగుపాముని ఆ పిల్లవాడు గానీ తల్లి గానీ గమనించలేక పోయింది.సరిగ్గా ఆ నాగు పాము ఉన్నచోటే ఆ పిల్లాడు కిందికి దిగాడు.
ఆ నాగుపాము తల ఉన్నచోటే అతడు కాలు వేసాడు.దీనిని గమనించిన ఆ నాగుపాము వెంటనే వెనక్కి తన తలను ఆ ప్లేస్ నుంచి వెనక్కి తీసుకుంది.
అప్పటికి ఆ చిన్నోడు నాగుపాముని గమనించలేదు.అందుకే మళ్లీ అతడు వెనక్కి పరిగెత్తాడు.
దాంతో సరిగ్గా అతడు నాగుపాము దగ్గరికి వెళ్లినట్లయింది.
దీనితో అటాక్ చేస్తున్నాడేమో అని ఆ నాగుపాము వెంటనే పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నించింది.
ఈ దృశ్యాలను చూసిన తల్లి వెంటనే ఆ బాలుడిని వెనక్కి లాక్కొని పాము కాటు నుంచి కాపాడింది.ఒక్క సెకన్ ఆలస్యమైనా ఆ పాము బాలుడిని కాటు వేసేది.
కానీ తల్లి చాలా అప్రమత్తతతో పిల్లాడి చేతిని పట్టుకొని అతడిని వెంటనే తన దగ్గరికి తీసుకుంది.ఆ తర్వాత ఆ పాము వీరిద్దరి పైకి రాకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది.
సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఇది చాలా షాకింగ్గా ఉందని కామెంట్ పెడుతున్నారు.
ఆ పాము పిల్లవాడిపై దాడి చేయాలంటే ముందుగానే దాడి చేసేది.కానీ అది అలా చేయకుండా తనని తాను కాపాడుకుంది.
ఆ తర్వాత కూడా దగ్గరికి వస్తే గానీ అది దాడి చేయడానికి ప్రయత్నించలేదు.అదృష్టం అంటే ఆ పిల్లాడిదే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆ తల్లిని కూడా బాగా ప్రశంసిస్తున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.