టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిదే.
మొదట రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు.మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవలే విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
అయితే సంక్రాంతికి మహేష్ సినిమా రావడం హిట్టు కొట్టడం ఇది మొదటిసారి కాదు 17 ఏళ్ల క్రితం మహేష్ ఒక్కడు సినిమా కూడా సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టింది.
గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది.2003 లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.కాగా ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదంలో ఇరుక్కున విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
కాగా ఈ సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి రాయడం మొదలు పెట్టారట.ఇక రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో, గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారట.
అప్పుడు మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయంతో గుణశేఖర్ కథలో వినిపించగా వెంటనే మహేష్ కథ నచ్చింది అని ఓకే చెప్పేసారట.ఈ సినిమా విషయంలో ఇద్దరు నిర్మాతలు పక్కకు తప్పుకోవడంతో ఎమ్మెస్ రాజు ఫ్రేమ్ లోకి వచ్చారట.
కాగా 2002లోనే 14 కోట్ల రూపాయలతో ఒక్కడు సినిమా తెరకెక్కింది.సినిమా తొలి రోజు తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అన్న టైటిల్ పెట్టాలని అనుకున్నారు.అయితే అప్పటికే ఆ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో గుణశేఖర్ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు.
ఆ తర్వాత కబడ్డీ అన్న పేరు అనుకున్నారు.చివరకు గుణశేఖర్ ఒక్కడు అన్న టైటిల్ చెప్పిన వెంటనే మహేష్ ఓకే చెప్పేశారు.
అలా ఒక్కడు సినిమా టైటిల్ పుట్టి మహేష్ కెరీర్ ను మార్చేసింది.