పాము కాటు నుంచి తన బిడ్డను రెప్పపాటులో కాపాడుకున్న తల్లి.. వీడియో చూస్తే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.

ఈ వీడియోలో ఒక పెద్ద నాగుపాము ఒక బాలుడిని కాటేయడానికి ప్రయత్నించింది.అయితే దీనిని చూసిన తల్లి రెప్పపాటు సమయంలో ఆ కాటు పిల్లవాడిపై పడకుండా కాపాడగలిగింది.

ఒళ్ళు గగుర్పొడిపించే ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటు చేసుకుంది.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.

ఒక తల్లి తన పిల్లాడిని స్కూలుకు పంపించాలని ఇంట్లో నుంచి బయటకు తీసుకు రావడం గమనించవచ్చు.

అయితే ఆ ఇంటి ముందు చాలా పొడవైన మెట్లున్నాయి.సరిగ్గా ఆ మెట్ల కిందకి ఒక పెద్ద నాగుపాము పాక్కుంటూ వచ్చింది.

అయితే ఈ నాగుపాముని ఆ పిల్లవాడు గానీ తల్లి గానీ గమనించలేక పోయింది.

సరిగ్గా ఆ నాగు పాము ఉన్నచోటే ఆ పిల్లాడు కిందికి దిగాడు.ఆ నాగుపాము తల ఉన్నచోటే అతడు కాలు వేసాడు.

దీనిని గమనించిన ఆ నాగుపాము వెంటనే వెనక్కి తన తలను ఆ ప్లేస్ నుంచి వెనక్కి తీసుకుంది.

అప్పటికి ఆ చిన్నోడు నాగుపాముని గమనించలేదు.అందుకే మళ్లీ అతడు వెనక్కి పరిగెత్తాడు.

దాంతో సరిగ్గా అతడు నాగుపాము దగ్గరికి వెళ్లినట్లయింది.దీనితో అటాక్ చేస్తున్నాడేమో అని ఆ నాగుపాము వెంటనే పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నించింది.

ఈ దృశ్యాలను చూసిన తల్లి వెంటనే ఆ బాలుడిని వెనక్కి లాక్కొని పాము కాటు నుంచి కాపాడింది.

ఒక్క సెకన్‌ ఆలస్యమైనా ఆ పాము బాలుడిని కాటు వేసేది.కానీ తల్లి చాలా అప్రమత్తతతో పిల్లాడి చేతిని పట్టుకొని అతడిని వెంటనే తన దగ్గరికి తీసుకుంది.

ఆ తర్వాత ఆ పాము వీరిద్దరి పైకి రాకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది.

సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఇది చాలా షాకింగ్గా ఉందని కామెంట్ పెడుతున్నారు.

ఆ పాము పిల్లవాడిపై దాడి చేయాలంటే ముందుగానే దాడి చేసేది.కానీ అది అలా చేయకుండా తనని తాను కాపాడుకుంది.

ఆ తర్వాత కూడా దగ్గరికి వస్తే గానీ అది దాడి చేయడానికి ప్రయత్నించలేదు.

అదృష్టం అంటే ఆ పిల్లాడిదే అని కామెంట్స్ చేస్తున్నారు.ఆ తల్లిని కూడా బాగా ప్రశంసిస్తున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?