వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. పొరపాటున మెసేజ్‌ను డిలీట్ చేసినా ఇబ్బంది ఉండదు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.ఇందులో భాగంగా గతంలో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

 A Feature That Can Be Found In Whatsapp Deleting A Message By Mistake Will Not-TeluguStop.com

అయితే ఇప్పుడు ఇందులో ఒక అప్‌డేట్ తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది.ఈ ఫీచర్‌లో డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి.

ఈ ఆప్షన్లలో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ కి బదులుగా ఒక్కోసారి పొరబాటున డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్ పై నొక్కేస్తుంటారు యూజర్లు.దీని వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది.

ఎందుకంటే ఆ మెసేజ్ మళ్లీ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేయడానికి వీలులేకుండా కనుమరుగవుతుంది.కానీ అవతల వారికి మాత్రం సెండ్ అయిపోతుంది.

ఫలితంగా ఇబ్బందులు తప్పవు.

అందుకే డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్‌ను పొరపాటున నొక్కినా మళ్లీ దాన్ని సరిదిద్దుకునేందుకు అన్‌డూ అనే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది.

మీరు పొరపాటున మీకు మాత్రమే మెసేజ్ డిలీట్ చేసినా వెంటనే ఈ అన్‌డూ ఆప్షన్‌తో దానిని తిరిగి పొందవచ్చు.ఆ తర్వాత ఆ మెసేజ్‌ను అందరికీ డిలీట్ చేసుకోవచ్చు.

ఈ ఆప్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలో మాత్రమే ఉందని తెలుస్తోంది.ఇది కొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Telugu Delete, Message, Latest-Latest News - Telugu

వాట్సాప్ మరి కొన్ని ఫీచర్లను కూడా పరిశీలిస్తోంది.అందులో మెసేజ్ ఎడిట్ అనే ఆప్షన్ అందర్ని ఆకట్టుకుంటోంది.దీనివల్ల మీరు మీ మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చు.తద్వారా మళ్ళీ కొత్తగా ఎలాంటి మెసేజెస్ పంపించాల్సిన అవసరం ఉండదు.గత కొద్ది రోజుల్లో వాట్సాప్‌లో చాలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ ఫీచర్లను పొందడానికి మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో మీ వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube