ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లకు, ఆండ్రాయిడ్ ఫోన్లకు మధ్య పోటీ ఉంటోంది.చాలా మందికి ఐ ఫోన్ వాడాలని ఉన్నా, అవి కొంచెం ఎక్కువ ధర ఉండడంతో ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే సరిపెట్టుకుంటారు.
అయితే ఏదో ఒక రోజు ఐ ఫోన్ కొనుక్కుని తమ కల నెరవేర్చుకుంటారు.ఈ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే డేటా మొత్తాన్ని ఐ ఫోన్‌లోకి ట్రన్స్‌ఫర్ చేసేందుకు చాలా కష్ట పడుతుంటారు.
అందులోనూ వాట్సాప్ చాటింగ్ హిస్టరీ, వీడియోలు, ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు అన్నింటినీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటారు.దీనికి ఇబ్బంది పడవల్సిన అవసరం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
జీమెయిల్ ఉపయోగించి, చాలా సులువుగా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తాన్ని ఐ ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
వాట్సాప్ చాట్ హిస్టరీని మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
అన్నిటి కంటే ముందుగా మీరు మీ వాట్సాప్ చాట్స్‌ను గూగుల్ బ్యాకప్ చేయాలి.ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ‘సెట్టింగ్స్‘ ఆప్షన్ ఎంచుకోవాలి.‘చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయాలి.
ఆ తరువాత మీకు ‘చాట్ హిస్టరీ’ ఆప్షన్ కనిపిస్తుంది.దానిని సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత మీరు ‘ఎక్స్‌పోర్ట్ చాట్ (Export Chat)’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.మీరు దేనినైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాలి.
ఆ సమయంలో మీకు వితౌట్ మీడియా, లేదా ఇన్‌క్లూడింగ్ మీడియా అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.వితౌట్ మీడియా ఎంచుకుంటే కేవలం మెసేజ్‌లు మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
ఇన్‌క్లూడింగ్ మీడియా ఆప్షన్ ఎంచుకుంటే చాట్ హిస్టరీతో పాటు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.వాటిని ఐఫోన్‌లో జీమెయిల్ డౌన్‌లోడ్ చేసుకుని, వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అందులోకి రీస్టోర్ చేసుకునే సౌలభ్యం ఉంది.
ఇలా డబ్బులు ఖర్చు లేకుండా సులువుగా వాట్సాప్ డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.అయితే కొన్ని యాప్‌లను ఉపయోగించి, డేటా ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది.
ఆయా యాప్‌లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.