బాంబు షెల్టర్‌లో పిల్లి.. యాంగ్రీ లుక్‌తో వైరల్ సెన్సేషన్ అయ్యింది!

కాస్త కూడా కనికరం లేకుండా రష్యా దేశం ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం పట్ల అక్కడి ప్రజలు తీవ్ర కోపంతో ఊగిపోతున్నారు.హాయిగా ఇంట్లో పడుకోవలసిన వారు తిండి, నీరు లేకుండా బాంబు షెల్టర్ లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వారికి వచ్చింది.

 A Cat In A Bomb Shelter Has Become A Viral Sensation With Its Angry Look , Ukrai-TeluguStop.com

వీరు మాత్రమే కాదు వీరి పెంపుడు జంతువులు కూడా బాంబు షెల్టర్స్‌లో తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే యుద్ధం వల్ల ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో తాజాగా ఒక పెంపుడు పిల్లి( Pet cat ) కూడా అంతే కోపంగా ఉంటూ కెమెరాకి చిక్కింది.

ఇది యాంగ్రీ లుక్‌తో కెమెరాకు ఫోజ్ ఇచ్చి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

ఉక్రెయిన్‌ ప్రజలు( Ukraine ) తమ దేశంలో జరుగుతున్న యుద్ధం గురించి తమకు ఎలా అనిపిస్తుందో చూపించడానికి దుప్పటి కప్పుకున్న ఈ పిల్లి ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.క్లోయ్ అనే పిల్లి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని బాంబు షెల్టర్‌లో దాక్కుంది.ఉక్రెయిన్ అధ్యక్షుడి మాజీ సలహాదారు ట్విట్టర్‌లో పిల్లి ఫొటో పంచుకున్నారు.ఉక్రెయిన్‌లో ప్రతి ఒక్కరూ ప్రస్తుతం క్లో క్యాట్ లాగా ఫీలవుతున్నారని ఆయన ఈ ట్వీట్‌కు క్యాప్షన్ జోడించారు

రాజధాని కీవ్‌పై ఇటీవల రష్యా దళాలు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశాయి.ఉక్రెయిన్ వైమానిక దళం రష్యా దాడి( Russia )ని ఆపడంతో కొంతమంది గాయపడ్డారు.రష్యా రాజధాని కీవ్‌, మాస్కో రెండూ పరస్పరం పోట్లాడుకుంటున్నాయి.నగరంలో పేలుళ్లు జరిగాయని, ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల సైరన్లు వినిపించాయని కీవ్‌ మేయర్ చెప్పారు.ఉక్రెయిన్ తమపై కూడా దాడి చేస్తోందని రష్యా అధికారులు చెబుతున్నప్పటికీ, ఉక్రెయిన్ దానిని ఖండించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube