ఆసుపత్రుల్లోని మృతదేహాలను జాగ్రత్తగా చూసుకునే విషయంలో కర్ణాటక హైకోర్టు( High Court of Karnataka ) ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.మరణించిన మహిళల మృతదేహాలపై ఎలాంటి అనుచిత చర్యలు లేదా నేరాలు జరగకుండా నిరోధించాలని ఆదేశించింది.
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోని మార్చురీల్లో ( Mortuarie )ఆరు నెలల్లోగా సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.ఇది ఆసుపత్రి సిబ్బంది మృతదేహాలపై లైంగిక దాడులు జరగకుండా పర్యవేక్షించడానికి, నిరోధించడానికి సహాయపడుతుంది.
ఓ నీచుడు మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆందోళన కలిగించే కేసును కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నిర్దిష్ట చట్టం లేదని, దీనిని నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని కోరింది.
సీసీ కెమెరాల( CCTV cameras) ఏర్పాటుతో పాటు మార్చురీలను కూడా పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.మరణించిన వారి గౌరవాన్ని కాపాడాల్సిన ప్రాముఖ్యతను న్యాయస్థానం ప్రత్యేకంగా నొక్కి చెప్పింది.ఆసుపత్రులు వైద్య రికార్డుల ప్రైవసీని కూడా కాపాడాలని తెలియజేసింది.HIV లేదా ఆత్మహత్యకు సంబంధించిన సున్నితమైన కేసులను నిర్వహించడానికి ప్రత్యేక విధానాలను కలిగి ఉండాలని చెప్పింది.
అంతేకాకుండా, పోస్ట్మార్టం రూమ్ ప్రజలకు కనిపించకుండా చూసుకోవాలని కోర్టు కోరింది.చివరగా, ఆసుపత్రుల్లోని సిబ్బందికి మృతదేహాలను ఎలా నిర్వహించాలో, మృతుల కుటుంబాలతో ఎలా సున్నితంగా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.మొదటగా విదేశాల్లో మాత్రమే మృతదేహాలపై రేప్ చేసే కామాంధులు ఉండేవారు.ఇప్పుడు ఇండియాలో కూడా ఈ కేసులు పెచ్చరిల్లితున్నాయి.