అమెరికాలో మళ్ళీ పేలిన తూటా...నల్లజాతి మహిళ మృతి...!!!

అగ్ర రాజ్యం అమెరికా అనే కంటే కూడా తూటాల రాజ్యం అనే పదమే అమెరికాకు సెట్ అయ్యేలా ఉంది.కొన్ని రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ స్కూల్ లో కాల్పుల ఘటన అమెరికా ప్రజలను కలిచి వేసింది.19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్స్ తూటాలకు బలై పోయిన ఘటన గతంలో ఎన్నడూ టెక్సాస్ లో జరగలేదని అక్కడి ప్రజలు వాపోయారు.ఈ ఘటన తరువాత అయినా పరిస్థితులు మారిపోతాయని, గన్ కల్చర్ పై ఆంక్షలు వస్తాయని,ఎలాగైనా సరే గన్ కల్చర్ కు చరమ గీతం పాడాలని స్వచ్చంద సంస్థలు ఆలోచన చేస్తున్న తరుణంలో మరో చోట తూటా పేలుడుకి అమెరికా మహిళా బలై పోయింది.

 A Bullet That Exploded Again In America Kills A Black Woman America, Gun Cultur-TeluguStop.com

అమెరికాలోని ఒక్లహామాలో తాజాగా జరిగిన కాల్పుల ఘటనలో ఓ నల్లజాతి మహిళ మృతి చెందింది.ఆదివారం నాడు ఒక్లహామాలోని ఓల్డ్ సిటీ స్కేర్ లో కోలాహలంగా మెమోరియల్ డే ఫెస్టివల్ ను జరుపుకుంటున్నారు.

ఈ వేడుకలలో సుమారు 20 మందికి పైగా పాల్గొన్నారు.ఈ వేడుకలో పాల్గొన్న వారిలో రెండు గ్రూప్ ల వారి మధ్య చిన్న పాటి ఘర్షణ మొదలయ్యింది.

దాంతో సహనం కోల్పోయిన ఒక గ్రూప్ కి చెందిన స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్కసారిగా తమతో గొడవ పడిన గ్రూప్ పై తుపాకితో కాల్పులు మొదలు పెట్టాడు.ఊహించని ఘటనతో షాక్ తిన్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్న తరుణంలో…

ఓ నల్లజాతి మహిళకు బలంగా బుల్లెట్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా మరో ఆరుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.గాయపడిన వారిలో 9 ఏళ్ళ పిల్లాడు కూడా ఉన్నాడని తెలుస్తోంది.కాల్పులు జరిపిన అనంతరం అతడు అక్కడి నుంచీ పారిపోయి నేరుగా పోలీసులకు లొంగి పోయాడని గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు అధికారులు తెలిపారు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం తుపాకి నియంత్రణ చట్టాలని తీసుకురావడంలో విఫలం అవుతోందని, గన్ కల్చర్ ని కొనసాగించాలని ప్రకటనలు చేసే ట్రంప్ లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం అమెరికాలో తూటాల వర్షం పడుతూనే ఉంటుందని , ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉంటాయని విమర్శిస్తున్నాయి స్వచ్చంద సంస్థలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube