జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.సామాజిక కార్యక్రమాల విషయంలో ముందుండే పవన్ కళ్యాణ్.
ఇప్పుడు తన సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తికి 25 లక్షల రూపాయల సహాయం చేసినట్టు తెలుస్తున్నది.ఈ విషయం ట్విట్టర్ ద్వారా మనకు తెలిసింది.
ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందే ఉంటాడు.క్యాన్సర్ తో పోరాటం చేసిన శ్రీజా ను హాస్పిటల్ లో కలిసి పరామర్శించడం దగ్గరి నుంచి.
హుదూద్, చెన్నై వరదలు తదితర విషయాల వరకు పవన్ కళ్యాణ్ ముందు ఉండి సహాయం చేశాడు.ఇక, ఇప్పుడు మరోసారి తన సెట్ లో పనిచేసిన రవి భార్యకు హార్ట్ ఆపరేషన్ కోసం పవన్ 25 లక్షలు సహాయం చేసి దట్ ఈజ్ పవన్ అనిపించుకున్నాడు.
మా పవన్ కళ్యాణ్ ని అందుకే మేము దేవుడు అని అంటాం అంటున్నారు కళ్యాణ్ అభిమానులు ఈ సంఘటన తరవాత.