మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు ఇటీవలే మెగా ఫ్యామిలీ నుండి గుడ్ న్యూస్ వచ్చింది.
చిరంజీవి తన రీ ఎంట్రీ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’కి రీమేక్‌గా చేయబోతున్నాడు అంటూ స్వయంగా రామ్ చరణ్ ప్రకటించాడు.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా సదరు రీమేక్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రకటన వచ్చింది.
దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.కాని అంతలోనే షాకింగ్ న్యూస్
మెగాస్టార్ చేతికి ఇటీవలే ఆపరేషన్ అయిన విషయం తెల్సిందే.
కొన్ని రోజుల పాటు చిరంజీవి కట్టుతోనే కనిపించాడు.ఆ కట్టు ఇటీవలే తొలగించారు.
ఆపరేషన్ తర్వాత కూడా చిరంజీవి చేతి నొప్పి తగ్గలేదని, దాంతో మరో సారి చిరంజీవికి ఆపరేషన్ చేయాలని వైధ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది.దాంతో మరో రెండు నెలల పాటు చిరంజీవి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ కారణంగానే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం మళ్లీ ఆలస్యం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.అసలు ఈ సంవత్సరంలో మెగా రీ ఎంట్రీ ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.







