మహేష్ బాబు పాపులారిటి గురించి కొత్తగా చెప్పేదేముంది.రాష్ట్రం దాటినా, దక్షిణ భారతం దాటినా, భారత దేశం దాటినా, తెలుగు సినిమా అంటే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు.
అసలు తెలుగు సినిమాపై అవగాహన లేనివారికి కుడా మహేష్ బాబు తెలుసు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మన సూపర్ స్టార్ చేసింది కేవలం తెలుగు సినిమాలే.
అది మామూలు తెలుగు సినిమాలు, బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ కుడా కాదు.మరి అంత పాపులారిటి ఎలా సంపాదించాడు, భాషతో సంబంధం లేకుండా మహేష్ ని ఎలా అభిమానిస్తున్నారు అంటే సమాధానం మహేష్ కుడా చెప్పలేరు.
బాలివుడ్ హీరో వరుణ్ ధవన్ షారుఖ్ తో కలిసి దిల్ వాలే లో నటించిన సంగతి తెలిసిందే.షారుఖ్ కి జోడిగా కాజోల్ నటించగా, వరుణ్ కి జోడిగా కృతి సనన్ నటించింది.
దిల్ వాలే ప్రమోషన్ కోసం పాకిస్తాన్ వెళ్లి అక్కడి చానెల్ కి ఇంటర్వ్యు ఇచ్చారు వరుణ్, కృతి సనన్.
కృతి మహేష్ సరసన 1- నేనొక్కడినే లో మెరిసిన సంగతి తెలిసిందే.
అలా మహేష్ బాబు గురించి చర్చ మొదలైంది.అప్పుడు వరుణ్ ధవన్ మాట అందుకొని ” తను (కృతి) హీరోపంటి తో పాటు మహేష్ బాబు గారితో ఓ సినిమా చేసింది ఇంతకుముందు.
మహేష్ బాబు దక్షిణాదిలో చాలా పెద్ద సూపర్ స్టార్.చాలా అంటే చాలా పెద్ద స్టార్.ఎంత పెద్ద స్టార్ అంటే అది నేను మాటల్లో చెప్పలేను.” అంటూ మహేష్ బాబు సూపర్ స్టార్డమ్ ని పాకిస్తాన్ చానెల్ లో కొనియాడాడు వరుణ్.