ముద్దుల హీరోకి చిక్కిన తెలుగు హీరోయున్

కృతి కర్బంద అంటే మనకి చూడచక్కని రూపం, అందమైన చిరునవ్వు, హోమ్లి ఇమేజ్ గుర్తుకు వస్తుంది.కృతి పట్ల యూత్ లో కూడా మంచి ఇమ్ప్రేషన్ ఉంది.

 Kriti Kharbanda To Debut In Bollywood-TeluguStop.com

కాని హిట్స్ లేవు.కృతి పేరుతో మనకి ఠక్కున గుర్తోచ్చె సినిమాలు రెండే.

ఒకటి పవన్ కళ్యాణ్ తీన్మార్, రెండు రామ్ చరణ్ బ్రూస్ లీ.కాని ఈ రెండు చిత్రాల్లో కూడా కృతి మేయిన్ హీరోయున్ కాకపోవడం వల్ల తెలుగులో కలిసి రాలేదు ఈ అమ్మడుకి.

కన్నడలో పెద్ద హీరోయిన్ గా ఎదిగినా, కన్నడ ఇండస్ట్రీ ని ఎవరు పట్టించుకుంటారు.అందుకే బాలివుడ్ తన అదృష్టాన్ని పరీక్షీంచుకునేందుకు సిద్ధమయ్యింది ఈ సుందరి.ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారు? హీరో ఎవరు అనుకుంటున్నారు?

సినిమా పేరు రాజ్-4 , హీరో ఇమ్రాన్ హాష్మీ.రాజ్ సీరీస్ సినిమాలు హర్రర్ తో పాటు యూత్ కి కిక్ ఎక్కించే హాట్ సన్నివేశాలు ఉంటాయి.

ఇక ఇమ్రాన్ హష్మీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.పక్కా హోమ్లీ ఇమేజ్ ఉన్న కృతి ఈ సినమాలో రెచ్చిపోనుందా? ముద్దు సన్నివేశాలు ఇరగదీస్తుందా? మనం కొత్త కృతిని చూస్తామా? ఇంతకు ముందు రాజ్ సినిమాల హీరోయిన్లుగా చేసిన కంగనా, బిపాషా బసులను మరిపిస్తుందా? తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube