కాస్ట్లీ...'సెల్ఫీ' కోర్స్

ఒక్కో కాలంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది…ప్రస్తుతం సెల్ఫీ అనే ట్రెండ్ లో మునిగి తేలుతున్నారు యువత.అయితే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనులు అప్పుడే మొదలైపోయాయి…విషయం ఏమిటంటే యూకేలోని సిటీ లిట్ కాలేజీ తమ విద్యార్థుల కోసం కొత్త కోర్స్‌ను ప్రవేశపెట్టనుంది.

 Selfie Course For 160 Dollars-TeluguStop.com

ఆర్ట్ ఆఫ్ సెల్ఫీ పేరిట పూర్తిస్థాయి సెల్ఫీలు తీయడంలో నిష్ణాతులను చేయడం కోసం ఈ కోర్స్‌ను తీసుకు వస్తునట్లు సమాచారం.ప్రపంచంలోనే సెల్ఫీ కోర్స్‌ను ప్రవేశ పెడుతున్న మొట్టమొదటి కళాశాల ఇదే అని చెప్పవచ్చు.

సెల్ఫీ కోర్స్‌ను 132 యూరోలు లేదా 160 డాలర్లకు నేర్పించనున్నారు.ఈ కోర్స్ ఈ ఏడాది మార్చ్ నెలలో ప్రారంభం కానుంది.

ఈ కోర్స్ పేరు ది ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్‌రెచ్యూర్.అయితే ఈ కోర్స్ లో ఉన్న ప్రత్యేకమైన ప్రత్యేకత ఏమిటంటే .ముప్పై రోజుల వ్యవధిలో సెల్ఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలా తీయాలో నేర్పుతారట.ఇప్పటికే దాదాపుగా ప్రపంచం మొతం సెల్ఫీలతో ఉర్రూతలూగిపోతుంటే, ఈ నేపథ్యంలో సెల్ఫీలు తీయడంలో తమదైన శైలిని, తాము తీసే వాటిని ఓ మంచి జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ఇది ఉపకరిస్తుందనే విద్యార్థులు ఈ కోర్సు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube