టీ టీడీపీకి షాక్‌

ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని అనుభవిస్తున్న తెలుగు దేశం పార్టీ తెలంగాణలో మాత్రం రోజు రోజుకు బలహీన పడిపోతుంది.ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.

 Tdp Loses Secunderabad Cantonment Polls-TeluguStop.com

ఇక తాజాగా జరిగిన సికింద్రబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఖాతా తెరవక పోవడం చర్చనీయాంశం అయ్యింది.కనీసం ఒక్కటి లేదా రెండు అయినా వార్డులు వస్తాయని అంతా భావించారు.

కాని అనూహ్యంగా తెదేపా ఖాతా తెరవలేక పోయింది.కంటోన్మెంట్‌ను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

ఈ ఓటమి ముందు ముందు జరుగబోతున్న ఎన్నికల ఫలితాలను సు స్పష్టంగా చూపిస్తున్నాయంటూ గులాబి శ్రేణులు అంటున్నాయి.రాబోతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూడా తెదేపాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఖాయం అంటున్నారు.

ఆంధ్రా పార్టీ అయిన తెలుగు దేశంను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా వినిపిస్తున్నాయి.కంటోన్మెంట్‌ ఎన్నికల్లో షాక్‌ తిన్న తెదేపా రాబోయే గ్రేటర్‌ ఎన్నికలను తలుచుకుని భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావాలని కలలు కన్న చంద్రబాబు ఈ ఫలితాలతో షాక్‌ తింటున్నట్లుగా తెలుస్తోంది.గ్రేటర్‌ ఎన్నికల సమయానికి ఏదైనా అద్బుతాలు జరిగితే తప్ప తెదేపాకు మంచి ఫలితాలు రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube